లేస్తే మనిషిని కానన్నట్లుగా జనసేనాని పవన్ మాట్లాడుతూ ఉంటారు. అపుడే పుట్టిన మనిషిలా అంతా  కొత్తగా  చెబుతూంటారు ఆయన వ్యవహార శైలిని తెలుగు రాష్ట్రాల ప్రజలు 2009 నుంచి చూస్తున్నారు. యువరాజ్యం అధినేతగా పంచెలు ఊడగొడతామంటూ రెచ్చిపోయే ఉపన్యాసాలు చేసింది ఇదే పవన్, చంద్రబాబు అవినీతికి విశ్వరూపం అంటూ నాడు యువరాజ్యం నుంచి దారుణమైన విమర్శలు చేసి 2014 నాటికి అదే చంద్రబాబుతో చేతులు కలిపిన పవన్ ని నమ్మేదెలా


పారిపోలేదా :


జగన్ సమస్యలు వదిలి పారిపోయారని, చంద్రబాబుకు సమస్యలు పట్టవని తాజాగా పవన్ కామెంట్స్ చేశారు. నిజానికి అస్పష్టమైన రాజకీయాలు చేసేది పవనేనని ఓ వైపు సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. కేంద్రంపై అవిశ్వాసం పెట్టండి, మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగి ఎంపీలను కూడగడతానంటొ పవన్ ఆరు నెలల క్రితం భారీ స్టేటెమెంట్ ఇచ్చారు. దానికి అనుగుణంగా మొదట వైసీపీ ఎంపీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తరువాత టీడీపీ పెట్టింది. చివరకు అవిశ్వాసం చర్చకు కూడా వచ్చింది. ఇంత జరిగినా పవన్ ఆ సీన్లో మాత్రం ఎక్కడా లేరు. పత్తా లేకుండా పోయారన్న సెటైర్లు వేసారంతా. 


ఇక విశాఖలో 2017 జనవరి 26న జల్లి కట్టు తరహాలో ప్రత్యేక హోదా కోసం పోరు బాట పడదామంటూ పవన్ పిలుపు ఇస్తే సినీ ప్రముఖులతో సహా యువత అంతా అక్కడ మోహరించారు. పవన్ మాత్రం షూటింగుల్లో గడుపుతూ ట్వీట్లు చేశారు తప్ప రాలేదు. ఈ రెండు ఘటనలే కాదు, రాజధాని భూముల సమస్యల పైన, ఏపీలో ఇతర సమస్యలపైన పవన్ అప్పటికపుడు ఏదేదో మట్లాడేసి మళ్ళీ ఆ వైపుగా రారు అన్న కామెంట్స్ ఉన్నాయి. దీన్ని పవన్ భాషలో పారిపోవడం అని అనరెమోనని సెటైర్లు సోష‌ల్ మీడియాలో పడుతున్నాయి.


అందరూ బాధితులే:


ఫిరాయింపుల చట్టం తీరును తప్పు పట్టాల్సిన పవన్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని జగన్ అంటూ కౌంటర్లేస్తున్నారు. ఆ మాటకు వస్తే, చంద్రబాబు సైతం తెలంగాణాలో టీడీపీ ఎమ్మెల్యేనను కాపాడుకోలేకపోయారు. కేసీయార్ సైతం అప్పట్లో తమ ఎమ్మెల్యేలను కాపడుకోలేక‌ నాటి కాంగ్రెస్ జమానాలో వదిలేసుకున్నారు. బీజేపీ కూడా తన ఎమ్మెల్యేలను ఇలాగే వదిలేసుకుంది. 
అంతెందుకు రేపు జనసేన తరఫున ఎమ్మెల్యేలు గెలిచినా వారిని పవన్ కాపాడుకోగలరన్న నమ్మకం ఏముంది.విలువలు లేని వ్యవస్థపై పోరాటం చేయాలి కానీ, వ్యక్తులను నిందించి ఏం ప్రయోజనం పవన్, రాజకీయాల్లో అధికారమే పరమావధి అయిపోయిన వేళ ఎవరైనా చూసేది ఆ వైపే, ఈ రోజు నీతులు చెబుతున్న వారంతా రేపు పవన్ ని చూస్తే ఆగుతారా. పవన్ ఈ విషయాలపై ద్రుష్టి పెట్టాలని సూచిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: