రాజ‌కీయాల్లోకి ఎందుకు వ‌స్తారు? అంటే.. అధికారం కోసం అనేది ప్ర‌తి ఒక్క‌రూ చెప్పేమాట‌. అయితే, ఇప్పుడు రాజ‌కీయాలు రంగు మారాయి. రాజ‌కీయాల్లోకి ఎంద‌కు వ‌స్తున్నారు? అంటే ఎవ‌రికి ఉండే వ్యూహాలు వారికి ఉంటున్నాయ‌ని, అందుకే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. 2014లో ఎన్నిక‌ల స‌మ‌యంలోనే పార్టీ పెట్టినా.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ మాత్రం ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండిపోయారు. అంతేకాదు, ఆయ‌న చంద్ర‌బాబుతో జ‌ట్టుక‌ట్టి.. ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు మ‌ద్ద‌తిచ్చారు. చంద్ర‌బాబును గెలిపించాల‌ని కూడా ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ ప‌రిణామాలు.. జ‌గ‌న్ పార్టీ వైసీపీని తీవ్రంగా దెబ్బ‌కొట్టాయి. దీంతో అధికారంలోకి వ‌స్తుంద‌ని భావించిన వైసీపీ విప‌క్షానికే ప‌రిమిత‌మైంది. అంటే.. ప‌వ‌న్ పార్టీ పెట్టి పోటీ చేయ‌క‌పోయినా.. దాని ప్ర‌భావంతో ఆయ‌న జ‌గ‌న్‌ను విప‌క్షానికే ప‌రిమితం  చేశారు. ఈ విష‌యాన్ని త‌ర్వాత ఆయ‌న ఒప్పుకొన్నారు కూడా.


ఇక‌, ఇప్పుడు కొద్ది నెలల కిందట స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ.. త్వరలో పార్టీ పెట్టబోతున్నారు. ఈ నెల 26న ఆయనే స్వయంగా దీనిపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం. పార్టీ జెండా, అజెండా, సిద్ధాంతాల గురించి ఆయన వివరించనున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓ జాతీయ పార్టీలో చేరతారని, తమతో కలిసి పనిచేయాలని మరో పార్టీ ఆహ్వానించిందని ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ.. ఆయన సొంతంగానే పార్టీ ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, నిజానికి ఎన్నిక‌ల‌కు కేవ‌లం నాలుగు నెల‌ల స‌మ‌యం ముందు ఇలా పార్టీ పెట్ట‌డం ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం అనేది సాధ్య‌మ‌య్యేనా? అంటే కానేకాద‌ని తెలుస్తోంది. దీని వెనుక వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ ఉంద‌ని.. దానిని అమ‌లు చేయాల‌నే త‌లంపుతోనే జేడీ ఇలా పార్టీ పెడుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


ఏపీలోనే కాకుండా అటు క‌ర్ణాట‌క‌, ఇటు త‌మిళ‌నాడు రాష్ట్రాల్లోనూ జేడీకి మేధావుల మ‌ద్ద‌తు పుష్క‌లంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పార్టీ పెడితే.. మేధావులు, విజ్ఞులు, నిపుణులు వంటి వారు ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచే అవ‌కాశం ఉంటుంది. అయితే, కేవలం వీరివ‌ల్లే ఆయ‌న అధికారంలోకి వ‌చ్చేయ‌డం సాధ్యం కాదు. కానీ, వీరు వేసే ఓట్లు చీల‌డం ఖాయం. అంటే.. ప్ర‌భుత్వంపై ముఖ్యంగా చంద్ర‌బాబుపై విసిగెత్తిపోయిన కొంద‌రు మేధావులు,..ప్ర‌త్యామ్నాయం కోసం చేస్తున్నారు. అయితే, వీరు అటు జ‌గ‌న్‌కు , ఇటు ప‌వ‌న్‌కు కూడా వేసే ఇష్టం లేక‌పోతే.. మ‌ధ్యేమార్గంగా జేడీని ఎంచుకునే ఛాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలో టీడీపీ వ్య‌తిరేక ఓట్లు చీల్చ‌డం ద్వారా బాబును ప్ర‌తిప‌క్షంలోకి నెట్టేందుకు జ‌రుగుతున్న వ్యూహాల్లో భాగంగానే జేడీ రాజ‌కీయ పార్టీ పెడుతున్న‌ట్టు ఓ వ‌ర్గం ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఏదేమైనా.. రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు!!


మరింత సమాచారం తెలుసుకోండి: