జరుగుతున్న ఎన్నకిల్లో కెసియార్ కే మళ్ళీ అధికారం వస్తుందా ? ఎవరి విశ్లేషణలు ఎలాగున్నా  టైమ్స్ నౌ మీడియా ప్రకటించిన సర్వే నివేదిక మాత్రం ఆసక్తికరంగా ఉంది. టైమ్స్ నౌ తాజా సర్వే ప్రకారం కెసియార్ దే అధికారమట. జరగబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ 70 సీట్లు గెలుచుకుంటుందని సర్వే చెబుతోంది. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనదానికన్నా ఓ 10 సీట్లు ఎక్కువగా సాధిస్తుందని సర్వే చెబుతోంది. అయితే, ఇక్కడే మరో విశేషం కూడా ఉంది. అదేమిటంటే, కెసియార్ చెప్పుకుంటున్నట్లు టిఆర్ఎస్ కు 100 సీట్లు వచ్చేంత సీన్ లేదని.

 

ఇక మహాకూటమి గురించి చెప్పుకుంటే కూటమి మొత్తం కలిపి 34 సీట్లు కూడా సాధించటం లేదని అర్ధమవుతోంది. ఇందులో కాంగ్రెస్ కు 31 సీట్లు వస్తాయట. అంటే పోయిన ఎన్నికల కన్నా ఓ 8 సీట్లు అదనంగా తెచ్చుకుంటుందన్న మాట. అదే విధంగా టిడిపి విషయానికి వస్తే కేవలం రెండంటే రెండే సీట్లు సాధిస్తుందని సంకేతాలందుతున్నాయి. అంటే పోయిన ఎన్నికల్లో గెలిచిన 15 సీట్లలో 13 ఓడిపోతోందట. ఎంఐఎం తన పట్టు నిలుపుకుంటోందని అర్ధమవుతోంది. ఇతరులు 5 సీట్లు వస్తాయట.

 

ఒకవైపు టిఆర్ఎస్, మహాకూటమి మధ్య పోటీ హోరా హోరీగా సాగుతోందని అనుకుంటుంటే సర్వే వివరాలేమో ఏకపక్షమనే చెబుతోంది. మహాకూటమి నేతలేమో తామే అధికారంలోకి వచ్చేస్తున్నట్లు ఉత్తమ్, కోదండరెడ్డి తదితరులు బల్లగుద్ది చెబుతున్న విషయం డొల్లే అని అర్ధమవుతోంది. లేకపోతే సర్వే తప్పన్నా అయ్యుండాలి. ఎందుకేంట, మహాకూటమిలో ఎన్ని లుకలుకలున్నాయో టిఆర్ఎస్ లోను అంతే గొడవలున్నాయి. ఈ నేపధ్యంలో కూడా టిఆర్ఎస్ కు 70 సీట్లు రావటమంటే గొప్పే.


మరింత సమాచారం తెలుసుకోండి: