ఏపీ రాజకీయం రోజురోజుకూ మారుతోంది. అనేక కొత్త సమీకరణలు చోటుచేసుకుంటునాయి. చెప్పాలంటే అధికార పార్టీ కేంద్రంగా చేయాల్సిన రాజకీయం జగన్ కేంద్ర బిందువుగా సాగుతోంది. దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న దానిపై ఇపుడు ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.


ఆయనే టార్గెట్:


ఏపీలో అన్ని పార్టీలకూ ఆయనే టార్గెట్ గా మారుతున్నారు. వాస్తవానికి పవర్లో ఉన్న పార్టీలపైనే ఎవరైనా గురి పెడతారు. తెలంగాణాలో చూసుకున్నా టీయారెస్ కి వ్యతిరేకంగా మహా కూటమి కట్టారు. ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ చంద్రబాబు కాంగ్రెస్ కూటమి కడుతున్నారు. నాలుగేళ్ళు బాబుపై పోరాడిన హస్తం పార్టీ నేతలు చెట్టాపట్టాలు వేసుకుంటున్నారు. మరో వైపు మూడవ పార్టీగా వచ్చిన జనసేన సైతం జగన్ పైనే బాణాలు వేస్తోంది. ఆయన అవినీతినే ప్రశ్నిస్తోంది. . వామ‌పక్షాలు సైతం జగన్ ని పక్కన పెడుతున్నాయి.


మాజీ జేడీ కొత్త పార్టీ :


ఈ టైంలో సీబీఐ మాజీ జాయింటి డైరెక్టర్ లక్ష్మీ నారాయణ కొత్త పార్టీతో జనం ముందుకు వస్తున్నారు. ఈ నెల 26న హైదరాబాద్ లో ఆయన లాంచనంగా తన పార్టీని ప్రకటిస్తారని అంటున్నారు. ఆయన పార్టీ పేరు వందేమాతరం కానీ, జనద్వని అని కానీ అంటున్నారు. ఆయన సైతం జగన్ కేసులు విచారించి అవినీతి పై ఉక్కుపాదం మోపే అధికారిగా సినిమా హీరో గ్లామర్ సంపాదించారు. దానిని పెట్టుబడిగా పెట్టి ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు.


ఈ మాజీ జేడీ పార్టీ పెడితే ఆయన సామాజికవర్గం ద్రుష్ట్యా  జనసేనానికి పెద్ద దెబ్బ అంటున్నారు. అలాగే జగన్ అవినీతి అంటూ ఆయన కూడా బయల్దేరితే యాంటీ జగన్ ఓట్లలో చీలిక వస్తుద్నని అంటున్నారు.,  దీనివల్ల రేపటి ఎన్నికల చిత్రం తీసుకుంటే జగన్ వర్సెస్ అదర్స్ గా మెల్లగా రూపు దిద్దుకుంటోంది. జగన్ కావాలనుకున్న వారు ఓ వైపు, వ్యతిరేకించే వారు మరో వైపు ఉంటే ఆ రాజకీమ సమీకరణలు అంతిమంగా జగన్ కే మేలు చేస్తాయని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎటూ బలమైన ప్రతిపక్షానికే పడుతుందని, అందువల్ల కొత్త పార్టీల సిధ్ధాంతాలు, సామాజిక  పొందిక చూసినపుడు జగన్ కంటే బాబు, పవన్ లకే ఓట్ల చీలిక ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: