తెలుగుదేశంపార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిపై ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ లుకౌట్ నోటీసు జారీ చేయటమే. ఆర్దిక అవకతవకలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సుజనా ఇళ్ళు, కార్యాలయాలపై ఈడి ఉన్నతాధికారులు దాడులు జరిపారు. శుక్రవారం రాత్రి మొదలైన సోదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. సుజనా పై ఆర్దిక ఆరోపణలు ఈనాటివి కావు. గతంలో సిబిఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. అయినా కేంద్రంలో చాలాకాలం పాటు మంత్రిగా కొనసాగిన ఘనడు. బ్యాంకుల నుండి వందల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఎగొట్టారన్నది సుజనా పై ఇప్పటి వరకూ ఉన్న ప్రధాన ఆరోపణ.

 

అయితే ఆ ప్రధాన ఆరోపణకు మరోటి కూడా జతకట్టింది. అదేమిటంట, బ్యాంకుల నుండి తీసుకున్న వందల కోట్ల రూపాయలను సుజనా దారి మళ్ళించారట. అది కూడా షెల్ కంపెనీలు పెట్టి మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్లు ఆడి అనుమానిస్తోంది. దానికి ఆధారాలు ఏమిటంటే, షెల్ కంపెనీలకు డైరెక్టర్లుగా తన కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులనే చూపారట. ఆ విషయం నిర్ధారణ కావటంతో తాజాగా దాడులు మొదలయ్యాయి. ఒకవైపు కీలక పత్రాలను, హార్డ్ డ్రైవులను స్వాధీనం చేసుకోవటం, మరోవైపు లుకౌట్ నోటీసు జారీ చేయటంతో అందరూ ఆశ్చర్యపోయారు. మామూలుగా అయితే లుకౌట్ నోటీసు జారీ చేశారంటే విషయం చాలా సీరియస్ అయితేనే చేస్తారు.

 

అనుమానితులు దేశం వదిలి వెళ్ళకుండానో లేకపోతే దర్యాప్తు సంస్ధలకు దొరక్కుండా తప్పించుకుంటేనో దర్యాప్తు సంస్ధలు లుకౌట్ నోటీసులు జారీ చేస్తాయి. ఇపుడా లుకౌట్ నోటీసులనే ఈడి జారీ చేసింది. దానికితో పాటు సుజనా కార్లను కూడా సీజ్ చేశారు. లుకౌట్ నోటీసు జారీ చేయటం, కార్లను సీజ్ చేయటం లాంటివి చేస్తున్నారంటే తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయో అన్న టెన్షన్ టిడిపి నేతల్లో పెరిగిపోతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: