నారా చంద్రబాబు నాయుడు ఇక నెఱస్తుడని నిర్ధారణ చేసుకోవచ్చేమో? తనపై సిబీఐ తదితర కేంద్ర సంస్థలు రాజకీయ కక్షతో దాడి చేయనున్నాయని చెపుతూ గత ఆరునెలలు పైగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను తనచుట్టూ వలయంగా ఏర్పడి కాపాడాలంటూ దీనంగా అర్ధిస్తూ వస్తున్నారు. సిబీఐ, ఈడి లాంటి కేంద్ర విచారణ సంస్థలు దాడి చేస్తే - తనను తానే వర్ణించుకుటున్నట్లు నీతిమంతుడను, నిజాయతిపరుడను, నిప్పును అని నిరూపించుకోవాల్సింది పోయి - సిబీఐ రాష్ట్రంలోకి ప్రవేసించటానికి వీలులేదని జిఓ ఇవ్వటం, ఆయనది నేఱగ్రస్థ చరిత్ర, అని ప్రత్యక్షంగా అంగీకరించటమే.
Image result for look out notices on sujana
చంద్రబాబును గౌరవించేవాళ్లు సైతం ఈచర్యతో ఆయనను క్షమించబోవటం లేదని అంటున్నారు. బహుశ ఆయన లేదా ఆయన అనుయాయులు ఏవో దుర్మార్గాలు, దుశ్చర్యలు చేసిఉండొచ్చుననే సందేహం ప్రజల్లో ఇప్పుడు పెల్లుబుకుతుంది. అయితే అది నిజమేమో అన్నట్లు దానికి సాక్ష్యంగా - రాష్ట్రంలో సిబీఐ ప్రవేశ నిషేధం వెనుక కారణం  ప్రజలనుకునే విషయం యదార్ధమేనన్నట్లు ఇప్పుడు ఆయన అతి దగ్గరి అనుయాయి సుజానా చౌదరిపై లుకవుట్ నోటీసులు విడుదలయ్యాయి.  
Image result for no entry for cbi in ap
వివరాలేమంటే కేంద్ర మాజీ మంత్రి ,టిడిపి రాజ్యసభ సభ్యుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి కంపెనీలలో సోదాలు చేసిన ఎన్-ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) తాజాగా ఆయనకు లుకౌట్ నోటీసు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీని ప్రకారం సుజనా తన ఇష్టం వచ్చినట్లు విదేశాల కు వెళ్లడానికి వీలు ఉండదు.
Image result for no entry for cbi in ap
ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆద్వర్యంలో ఏర్పాటైన 120 కంపెనీలు పెద్దఎత్తున బ్యాంకుల నుంచి ఋణాలు పొంది దుర్వినియోగం చేశారని అబియోగం వస్తోంది.ఇప్పటికే మారిషస్ బ్యాంక్ వంద కోట్ల ఋణానికి సంబందించి కోర్టులో పోరాటం చేస్తోంది. కాగా తాజాగా సుజనా చౌదరికి చెందిన లక్జరీ కార్లను కూడా ఎన్-పోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది.
Related image
కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి సంబందంచిన కంపెనీలపై ఆదాయపన్ను (ఐటి) శాఖ అదికారులు దాడులు చేసి సోదాలు నిర్వహించారు. చెన్నై నుంచి వచ్చిన ఎన్-పోర్స్మెంట్ అదికారులు తనిఖీలు జరిపినట్లు సమాచారం. నకిలీ  లేదా షెల్ కంపెనీలు ద్వారా జరిగిన లావాదేవీలను గుర్తించారని వచ్చిన ఆరోపణల నేపద్యంలో ఈ దాడులు జరిగాయని అంటున్నారు. 
Image result for look out notices on sujana
కొన్ని కీలకమైన పత్రాలు ఈ దాడులలో దొరికాయని చెబుతున్నారు. నాగార్జున హిల్స్‌ లో ఉన్న సుజానా గ్రూపుకు చెందిన కంపెనీలో రెండు రోజులగా సోదాలు చేశారు. splendid Metal Products Limited, సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ కంపెనీలలో శుక్రవారం రాత్రి వరకు అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ కంపనీలకు చెందిన పలు పత్రాలను అధికారులు పరిశీలించి, కీలక పత్రాలను ఐటీ అధికారులు తీసుకెళ్లారని తెలుస్తుంది.

Image result for sujana's splendid metal products limitedదరిమిలా మనకర్ధం అయ్యేదేమంటే రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడన్న ఆలోచన వెనుక చంద్రబాబు నాయుడుగారి వ్యూహమేమిటో అర్ధమౌతుంది కదా! దానిని తను, తన కుటుంబం, అనుయాయులు, మిత్రులను కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి కాపాడుకోవటానికే  సిబీఐకి రాష్ట్రంలో ప్రవేశ నిషేదం చేస్తూ, ప్రభుత్వం ఉత్తర్వును విడుదల చేసిందన్న ప్రజలే కాదు విశ్లేషకుల అభిప్రాయం నిజమేనని ఋజువౌతుంది. 

Image result for no entry for cbi in ap

మరింత సమాచారం తెలుసుకోండి: