ఇటీవల మండపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత జగన్ పై దారుణంగా విమర్శల వర్షం కురిపించారు. తన పార్టీకి  ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనేశారు అంటూ జగన్ రోడ్డుమీద ముసలి కన్నీరు కారుస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అసెంబ్లీకి వెళ్లకుండా వ్యవహరించడం దారుణమని.. ప్రజలు మిమ్మల్ని నమ్మి ప్రతిపక్షంలో కూర్చోపెడితే  ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష నేత అధికారం కోసం పాదయాత్ర చేయడం సిగ్గుచేటు అంటూ జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. అంతేకాకుండా తన పార్టీ ఎమ్మెల్యేలను ఆపుకోలేని వ్యక్తి రాజకీయాలు ఎందుకు అని నిలదీశారు.

Image may contain: 1 person, playing a sport and standing

వైఎస్ జగన్ తప్పుకో నేను వస్తా నేను చూసుకుంటానని సవాల్ విసిరారు. జగన్ స్థానంలో తాను ఉంటే భయపడి రోడ్లపై వెళ్లేవాడిని కాదని ఎమ్మెల్యేలు అంతా అమ్ముడుపోయినా తాను వెనకడుగు వెయ్యనని ఒక్కడినే అయినా అసెంబ్లీకి వెళ్తానన్నారు. అంతేకానీ జగన్ లా భయపడి రోడ్డున పడనన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చాలామంది వైసీపీ నేతలు మరియు సోషల్ మీడియా లో కొంత మంది నెటిజన్లు పవన్ కళ్యాణ్ పై దారుణమైన సెటైర్లు వేశారు. భారతీయ ప్రజాస్వామ్యం గురించి విలువలు చెప్పే పవన్ కళ్యాణ్ సంతలో వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ కొం టున్న క్రమంలో టిడిపితోనే జతకలిసి ఆనాడు పవన్ ఉన్నారు అప్పుడు ప్రశ్నించని పవన్ ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని పవన్ కళ్యాణ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Image may contain: one or more people

ఇదే క్రమంలో అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ఒక ఊపు ఊపు తాను అని తెగ ఉదరకొడుతున్న పవన్ కళ్యాణ్ అప్పట్లో 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే చంద్రబాబు కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తానని ప్రజలకు మాట ఇచ్చావు..మరి నువ్వేం చేస్తున్నావు అంటూ పవన్ కళ్యాణ్ కి కౌంటర్ లు వేస్తున్నారు నెటిజన్లు.

Image may contain: 2 people, people smiling, people standing

ఆనాడు జనసేన పార్టీ స్థాపించిన రోజు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించడానికి పార్టీని మరియు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన అన్నయ్య చిరంజీవి ని కాదని తెలుగుదేశం పార్టీతో జత కలిసి వారితో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇప్పుడు వైసీపీ పార్టీ పై ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తూ పతివ్రత కబుర్లు చెబితే ఎవరూ నమ్మరని..ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు చొక్కాపట్టుకుని ప్రశ్నించమని..ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు నెటిజన్లు.



మరింత సమాచారం తెలుసుకోండి: