దేశంలో రోడ్డు ప్రమాదల సంఖ్య రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి.  ప్రభుత్వాలు రోడ్డు భద్రతల గురించి ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా..కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రమాదాలు సంబవిస్తున్నాయి.  ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదల వల్ల వందల సంఖ్యల్లో అమాయకులు చనిపోతున్నారు.  తాజాగా కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పడంతో ఇక్కడి కావేరీ కేసీ కాలువలోకి దూసుకెళ్లింది.  ఈ ప్రమాదంలో 20 మంది ఊపిరాడక చనిపోయారు.  

కాగా, బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకు వెళ్లడంతో అక్కడ ఉన్నవారు వెంటనే నీటిలో దూకి బాధితులను కాపాడే ప్రయత్నం చేశారు.  వెంటనే విపత్తు నిర్వహణ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీస్ అధికారి మాట్లాడుతూ..ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు.
Image result for karnataka mandya district bus accident
కాలువలో నీటి ప్రవాహం నిండుగా ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉందన్నారు. ప్రమాదంలో ఊపిరాడక చనిపోయిన వారిలో  విద్యార్థులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: