టీడీపీ అధినేత చంద్రబాబు సహనానికి మారు పేరు. నెత్తిన పిడుగు పడినా అయన చలించరు. ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఆయన వెంటనే రియాక్ట్ అవుతారు. తరువాత ఏంటన్నది ఆలొచన చేస్తారు. రాజకీయాల్లో ఆయన్ని ఓ విధంగా స్పూర్తిగానే చూడాలి. ఇపుడున్న వారిలో లేని గొప్ప గుణం నిదానం బాబులో మెండుగా ఉంది. 


అనంత అసహనం :


అటువంటి బాబు ఈ మధ్య తీవ్ర అసహనానికి గురి అవుతున్నారు. అయిన దానికీ కాని దానికీ కూడా ఆయన సహనం కోల్పోతున్నారు. ఆయనలో గతంలో చూడని కొత్త విషయం ఇది. వయసు మీద పడిన కారణమా లేక రాజకీయ వత్తిళ్ళో తెలియదు కానీ బాబులో బాగా మార్పు వస్తోంది. అది చాలా సందర్భాలలో బయటపడింది. ఇపుడు అనంతపురం టూర్లో మరింతగా వెలుగుచూసింది.


 ఈ రోజు అనంతపురం పర్యటనలో ఓ అగ్రి గోల్డ్ బాధితుడు బాబుని కలసి తన సమస్య విన్నవించుకున్నపుడు బాబు ప్రతిస్పందన ఆక్షేపణీయంగా ఉంది. ఎంతో అసహనంతో సమాధానం చెప్పిన బాబు నేనేం చేస్తానన్న ధోరణిలో మాట్లాడడం మొత్తం అగ్రి గోల్డ్ బాధితులనే కలచివేసింది. పైగా బాబు బాడీ లాంగ్వేజ్ . హావ భావాలు కూడా ఆవేశంగా ఉండడం ఓ విధంగా లోపలి బాబు బయట పడిపోయారా అనిపించేలా చేసింది. 


సీబీఐ విషయంలో :


ఇక ఇదే అనంతపురంలో బాబు సీబీఐ కి ఏపీ నో ఎంట్రీ జీవోను తొలిసారిగా  గట్టిగా సమర్ధించుకోవడం విశేషం. నేను చేసింది కరెక్ట్ వ్యవస్థలు ఏం బాగులేవు.కేంద్ర ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని  బాబు మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వల్ల ఎవ్వరికి చిల్లిగవ్వ ఉపయోగం లేదన్నారు. ఇక దేశ క్షేమం కోసమే కాంగ్రెస్ తో అవగాహనకు వచ్చామని కూడా చంద్రబాబు చెప్పుకున్నారు.


అదే అసలు కారణమా :


బాబు అనంత టూర్లో ఉన్నపుడే ఆయన అనుంగు అనుచరుడు, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇళ్ళు, కంపీనీలపై ఈడీ దాడులు చేయడం, నోటీసులు జారీ చేయడంతో బాబులో ఒక్కసారిగా అసహనం బయటకు తన్నుకువచ్చిదంటున్నారు. ఆ అక్కసును బాబు మీటింగులో బయట పెట్టుకోవడమే కాకుండా మోడీ సర్కార్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా బాబు అభద్రతా భావంతో ఉన్నారని, అందువల్లనే ఆయనలో ఎన్నడూ లేని అసహనం బయటపడుతోందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: