సుజనా చౌదరి అవినీతి చిట్టా ఇప్పుడు బయటికి వస్తుంది. వేల కోట్లు బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టి దర్జాగా ఇన్ని రోజులు కేంద్ర మంత్రి పదవులు కూడా అనుభవించారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న కీలక పత్రాల్లోనూ ఈ కంపెనీలన్నీ సుజనాచౌదరి ఛైర్మన్ గా - ఆయన ఆదేశాలతోనే కొనసాగుతున్నట్టు గుర్తించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయా కంపెనీల అధికారులు - సుజనా చౌదరి తో జరిపిన పరస్పర ఈమెయిల్స్ గుర్తించారు.


షాక్ : టీడీపీ నేత సుజనా చౌదరి అరెస్ట్ కు రంగం సిద్ధం ... మరీ బాబు ఏం చేస్తాడు...!

మరోవైపు అక్టోబర్ 8నాటి సోదాల సందర్భంగా బీసీఈపీఎల్ డైరెక్టర్లు సైతం ఈ మొత్తం వ్యవహారలు సుజనాచౌదరే చూసుకుంటారని వారు అంగీకరించినట్టు తెలిపారు. బీసీఈపీఎల్ కంపెనీ తీసుకున్న బ్యాంకు రుణాలు ఏవిధంగా ఉపయోగించారన్న విషయాలు సైతం తమకు తెలియదని వారు చెప్పినట్టు ఈడీ తెలిపింది. కేసు దర్యాప్తు కొనసాగింపుగా శుక్ర - శనివారాల్లో సుజనా చౌదరి ఇల్లు - కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న పలు ఫైళ్లు - కీలక డాక్యుమెంట్ల ప్రకారం సుజన గ్రూప్ కంపెనీలు పలు బ్యాంకులను రూ.5700కోట్లకు పైగా మోసగించినట్టు గుర్తించామని ఈడీ వెల్లడించింది. 


షాక్ : టీడీపీ నేత సుజనా చౌదరి అరెస్ట్ కు రంగం సిద్ధం ... మరీ బాబు ఏం చేస్తాడు...!

సుజనా గ్రూప్ కంపెనీలపై ఇప్పటికే డీఆర్ ఐ - ఫెమా - సీబీఐలో మరికొన్ని కేసులు కూడా నమోదై ఉన్నట్టు గుర్తించామని ఈడీ తెలిపింది. సుజనా గ్రూపు ఆధ్వర్యంలో 120పైగా షెల్ కంపెనీలు ఉన్నాయని - వీటిలో చాలా కంపెనీలు కేవలం కాగితాల పైనే ఉన్నాయని - మరికొన్ని మనుగడలో లేనివి ఉన్నాయని తెలిపింది.  అదేవిధంగా పలు డమ్మీ కంపెనీల పేరిట రిజిస్ట్రర్ చేయబడిన ఆరు అత్యంత ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వెల్లడించింది. వీటిలో ఫెరారీ - రేంజ్ రోవర్ - బెంజ్ తదితర కార్లు ఉన్నట్టు తెలిపింది. వీటన్నింటి ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈనెల 27న ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని సుజనా చౌదరికి ఈడీ నోటీసులు జారీ చేసింది. కాగా ఈ సోదాలపై సుజనా అధికారికంగా స్పందించాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: