తెలుగుదేశం పార్టీలో అంతా పవిత్రులే ఉంటారని చంద్రబాబు చెబుతూంటారు. అవినీతిపరులను ఉక్కుపాదంతో ఏరేస్తామని కూడా హూంకరిస్తూంటారు. అవినీతి అంతం మా పంతం అని కూడా గంభీరమైన ప్రకటన‌లు చేస్తూంటారు. తెల్లారి లేస్తే విపక్షాలపైన విమర్శలు చేస్తూ తాము ఏమీ ఎరగని సుద్ద పూసలమని చెప్పుకుంటూంటారు. ఐతె ఇపుడు ఒక్కసారిగా సీన్ తిరగబడింది.


దెబ్బకు మటాష్:


టీడీపీలో ఇపుడు ఎంపీ సుజన చౌదరి ప్రకంపనలు కూసాలు కదిలిస్తున్నాయి. చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడైన ఎంపీగా ఆయనకు పేరుంది. ఏరి కోరీ మరీ రెండు మార్లు సుజనా చౌదరిని పెద్దల సభకు పంపించారు చంద్రబాబు. అంతే కాదు, పట్టుపట్టి మరీ మోడీ క్యాబినెట్లో మంత్రికి కూడా చేశారు. అటువంటి సుజనా చౌదరి ఇపుడు ఈడీ కి అడ్డంగా దొరికేశారు. 


డొల్ల కంపెనీల పేరు మీద ఏకంగా 5,700 కోట్ల రూపాయలకు పైగా రుణాలు తీసుకుని బ్యాంకులకు ఎగనామం పెట్టారని ప్రచారం సాగుతోంది. ప్రపంచంలోని 120 దేశాల్లో ఈ కంపీనీలు ఉన్నాయని చూపిస్తూ బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చారని కూడా ఈడీ దర్యాప్తులో తేలింది. మరి దీనిని సుజానా చౌదరితో పాటు టీడీపీ నేతలు ఏమంటారో  చూడాలి. నిజానికి ఈ పరిణామాలు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు ఈ అవినీతి కుంభకోణం బయటపడడంతో పసుపు శిబిరం తెల్లబోతోంది.


జగన్ని ఇంకా అనగలరా:


ఇన్నాళ్ళూ టీడీపీ నేతలు పెద్ద నోరు చేసుకుని వైసీపీ అధినేత జగన్ ని లక్షలో కోట్లు దోచేశారని నిందించేవారు. ఇపుడు వారి నోర్లకు తాళం పడక తప్పదు, తమ వద్దనే అవినీతిని ఉంచుకుని ఇతరులపై వేలెత్తి చూపితే జనం దుమ్మెత్తిపోస్తారు.  నిజానికి సుజనా చౌదరి వ్యవహారంలో టీడీపీ ఏం చర్యలు తీసుకునే ధైర్యం కూడా చేయలేదు అంటున్నారు. ఆయన ఏకంగా పెదబాబు, చినబాబులకు దోస్త్ కావడం వల్ల ఆయనపైన బలంగా ఎన్ని ఆరోపణలు వచ్చినా పార్టీని సైతం ఫణంగా పెడతారు తప్ప అంతకంటే ఏమీ చేయరని కూదా అంటున్నారు.


ఎంపీ సభ్యత్వం రద్దు చేయగలరా :


ఇదిలా ఉండగా వైసీపీలో కొత్తగా చేరిన సీ రామచంద్రయ్య సుజనా చౌదరి అవినీతి భాగోతంపై ఈ రోజు మీడియా మీటింగులో ఘాటుగా స్పందించారు. సుజనా చౌదరి ఎవరో కాదని, చంద్రబాబుకు బినామీ అని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. అవినీతిపై పెద్ద గొంతు వేసుకుని మాట్లాడే చంద్రబాబు సుజనా రాజ్యసభ సభ్యత్వం రద్దు చేయగలరా అని రామచంద్రయ్య నిలదీశారు. బాబుకు దమ్ముంటే స్వతంత్ర్య సంస్థతో దర్యాప్తు జరిపించాలని కూడా డిమాండి చేశారు. ఇంతటి కీలకమైన అంశంపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించకపోవడాన్ని కూడా రామచంద్రయ్య తప్పుపట్టారు.



మరింత సమాచారం తెలుసుకోండి: