ఏపీలో మ‌రో ఆరు మాసా్ల్లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో ఇక్క‌డ అధికార పార్టీ తిరిగిఅధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. అయితే, స్థానికంగా టీడీపీకి అనుకూలంగానే ప‌రిస్థితి ఉందా?  లేక ఏమైనా అనూహ్య ప‌రిస్థ‌తి ఏర్ప‌డి పార్టీకి బ్యాడ్ నేమ్ వ‌స్తుందా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.  విష‌యంలోకి వెళ్తే.. ఇప్పుడు తెలంగాణాలో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అయితే, అక్క‌డ అధికార పార్టీ నేత‌ల‌కు ప్ర‌జ‌ల నుంచి ఊహించ‌ని విధంగా స‌త్కారం ల‌భిస్తోంది. అత్యంత కీల‌క‌మైన నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌నుంచి ఛీత్కారాలు అందుకుంటున్నారు. ``నువ్వు అధికారంలోకి వ‌చ్చినంక‌.. మాకు ఏం చేసిన‌వ్‌``? అని ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. ర‌స‌మ‌యి బాల‌కృష్ణ వంటి ప్ర‌జాగాయ‌కుడికి కూడా ఇలాంటి ప్ర‌శ‌లే ఎదురు కావ‌డం.. కొన్ని చోట్ల ప్ర‌జ‌లు చెప్పుల‌తో కొట్టేందుకు ప్ర‌య‌త్నించ‌డం సంచ‌ల‌నంగా మారింది. 

Image result for rasamayi balakrishna

ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల నుంచి ఇలాంటి ప‌రిస్థితే త‌మ‌కు కూడా ఎదుర‌వుతుంద‌ని ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు భ‌య‌ప‌డుతున్నారు. మరో ఆరు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. నియోజకవర్గాల్లో తాము ఇప్పటిదాకా పెద్దగా వెళ్లని నివాస ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా అని ఎమ్మెల్యేలు లెక్కలు తీస్తున్నారు. ముందుగా అక్కడకు వెళ్లి ప్రజలను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కింది స్ధాయి నాయకులతో మాట్లాడుతూ పెండింగ్‌ సమస్యలు ఎక్కడ ఎలాంటివి ఉన్నాయో ఆరా తీస్తున్నారు. సొంత పార్టీలోనే ఉన్నా వివిధ కారణాలతో దూరమైన గ్రామ, మండల స్థాయి నాయకులతో సంబంధాలు మెరుగుపర్చుకొనే ప్రయత్నం మొదలు పెట్టారు.
ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా పూర్తిగా నియోజకవర్గ పర్యటనల్లో నిమగ్నమయ్యారు. బాగా ముఖ్యమైన పనిఉంటే తప్ప మెజారిటీ ఎమ్మెల్యేలు సచివాలయానికి కూడా రావడం లేదు.

Image result for mahakutami

అనేక మంది మంత్రులు కూడా శాఖాపరమైన పనులు తగ్గించుకొని సొంత నియోజకవర్గాలకు... సొంత జిల్లాకు సమయం పెంచడం గమనార్హం. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండేలా ఏడాది కిందటి నుంచే చంద్రబాబు ప్రణాళికలు రచించారు. గత ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం జరిగిన రెండు నెలలు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు తన వద్దకుగానీ, రాజధానికి గానీ వస్తే ఊరుకోలేదు. దీంతో ఎమ్మెల్యేలకు దీనిని సీరియ్‌సగా తీసుకోక తప్పలేదు. ఈ కార్యక్ర మంలో అందిన వినతిపత్రాలను పరిష్కరించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల కొత్త సామాజిక పింఛన్లు మంజూరు చేసింది. రెండు లక్షల తెల్ల రేషన్‌ కార్డులు ఇచ్చారు. ఇలా మొత్తంగా ప్ర‌భుత్వం పై యాంటీ లేకుండా చేసుకున్నారు. కానీ, కొంద‌రు నాయ‌కుల్లో మాత్రం గుబులు అలా ఇలా లేదు. మ‌రి బాబు ఏం చేస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: