గడచిన కొన్ని రోజులుగా జనసేనాని మాటలలో తేడా వస్తోంది. ఆయన బాణాలు వేరే రూట్లోకి వెళ్తున్నాయి. ఆయన సెటైర్లు కూడా ఆ వైపు నుంచి ఈ వైపుగా మళ్లాయి. పవన్ ఎందుకిలా చేస్తున్నారు. ఆయనలో ఒక్కసారిగా ఎందుకు మార్పు కనిపిస్తోంది అని అంతా చర్చించుకుంటున్నారు. పవన్ మళ్ళీ యూ టర్న్ తీసుకున్నారా అన్న డౌట్లూ వ్యక్తం చేస్తున్నారు.


బాబు లాగానే:


అచ్చం టీడీపీ అధినేత చంద్రబాబు బాణీలోనే పవన్ కూడా ప్రసంగాలు చేస్తున్నారు. జగన్ని  ఆయన ఘాటుగా విమర్శిస్తున్నారు. అవినీతిని పదే పదే ప్రశ్నిస్తున్నారు. నిజానికి జగన్ పైన ఉన్న అవినీతి కేసులని చంద్రబాబు, పవన్ 2014 ఎన్నికల్లో బాగా వాడేసుకున్నారు. జనం కూడా తీర్పు ఇచ్చారు. మళ్ళీ అదే బూచిని చూపించి నెగ్గాలని ఓ వైపు చంద్రబాబు ప్రయత్నం చేస్తూంటే ఇపుడు ఆయనకు పవన్ తోడు అయ్యారు. బాబు స్క్రిప్ట్ ని పవన్ చదువుతున్నారని వైసీపీ నేతలు అందుకే ఆరోపణలు చేస్తున్నారు.


సుజనాపై మాట లేదేం :


ఇక లేటేస్ట్ అవినీతి పురాణం ఏపీలో జరుగుతోంది. అది అమరావతి రాజధాని అయినా, పోలవరం భాగోతమైనా, పట్టిసీమ అయినా, ఇసుక మాఫియా అయినా ఎన్న్నో అవినీతి కధలు కళ్ళ ముందు ఉంటే వాటిని పవన్ ఇపుడు ప్రస్తావించకపోవడాన్ని కూడా వైసీపీ నేతలు తప్పు పట్టే పరిస్థితి ఉంది. అంతెందుకు చద్రబాబుకు అత్యంత సన్నిహితునిగా ఉన్న సుజనా చౌదరి మీద ఈడీ దాడులు చేయడం ఇపుడు ఏపీలో హాట్ టాపిక్, మరి పవన్ దాన్ని ఎక్కడా కనీస మాత్రమంగా కూడా ప్రస్తావించకపోవడాన్ని వైసీపీ నేత పేర్ని నాని నిలదీశారు కూడా.


టీడీపీని గెలిపిస్తారా:


పవన్ వైఖరి చూస్తూంటే బలమైన ప్రతిపక్షం వైసీపీ ని దెబ్బ కొట్టి టీడీపీని ఏపీలో మరో మారు గెలిపించేందుకు చూస్తున్నారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ నిలకడ లేని తత్వానికి ఇది నిదర్శనమని ఏకంగా వైసీపీ సీనియ‌ర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు  కామెంట్స్ చేశారు. జనంలో ఉంటూ సమస్యలు తెలుసుకుంటున్న జగన్ని పవన్ నిందించడం వెనక ఏమైనా కారణాలు  ఉన్నాయా అని కూడా వైసీపీ నేతలు అడుగుతున్నారు. మరి పవన్ లో ఈ ఆకస్మిక మార్పునకు కారణం ఏంటో కాలమే జవాబు చెప్పాలేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: