ఈ దేశంలో పేరుకే ప్రజాస్వామ్యమని మరో మారు రుజువు చేసేలా నకిలీ ఓట్ల భాగోతం రచ్చకెక్కింది. ఏపీలో ఇటీవల ఓట్ల నిర్వహించిన ఓట్ల నమోదు అనంతరం  చూసుకుంటే నకిలీ ఓట్లు ఏకంగా అర కోటి పై మాటగా తేలాయంటే ఇంక ఎవరు ఓటు వేసినా వేయకపోయినా పార్టీలకు హ్యాపీనే కదా. చాల స్వల్ప ఆధిక్యతలతో విజయం సాధిస్తున్న వర్తమాన హారాహోరీ పోరులో ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు నకిలీవి ఉండడం దారుణమే. 


పదిహేను శాతం పైగా :


ఏపీలో ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకూ చేపట్టిన ఓట్ల నమోదు తరువాత పరిస్థితి చూస్తే మొత్తం ఓటర్ల సంఖ్య మూడు కోట్లకు చేరింది. ఇందులో నకిలీ ఓటర్లు  52.67 లక్షల నకిలీ ఓటరులు ఉన్నారని అధికారికంగానే తేలింది.  ఇది నిజంగా విస్తుబోయే భయంకరమైన నిజం. మొత్తం ఓట్లలో పదిహేను శాతం పైగా నకిలీ ఓట్లే ఉంటే ఇంక ఎన్నికలు ఎందుకు, పోటీ ఎందుకు, గెలుపు ముందే డిక్లేర్ అయిపోయిందిగా అంటున్నారు ప్రజాస్వామ్య ప్రియులు. ఇంత పెద్ద మొత్తంలో నకిలీ ఓట్లు ఉంటే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఊపందుకుంది.


అక్కడా. ఇక్కడా :


రెండు తెలుగు రాష్ట్రాలు అయ్యాక అక్కడా, ఇక్కడా కూడా ఓటు ఉన్న వారు ఎక్కువయ్యారు. అలాగే, చనిపోయిన వారు కూడా ఓటర్ల లిస్టులో  ఉన్నారు. పాలు తాగే పసివారు ఓటర్లుగా ఉండడం విశేషం. ఇంటి పేరును అటు ఇటూ మార్చేసి ఓటర్లుగా ఉన్న వారూ ఉన్నారని తేలుతోంది. దీనిని అదనంగా మరో 20 లక్షల బోగస్ ఓట్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు. చూస్తూంటే ఉన్న ఓటర్ల కంటే కూడా నకిలీ ఓటర్లే ఎక్కువమంది ఉన్నట్లుగా కనిపిస్తోంది


చర్యలకు డిమాండ్ :


బోగస్, నకిలీ ఓటర్లను ఏరివేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లు ఉంటే ప్రజాస్వామ్యం ఇంక ఎలా బతుకుతుందని ఆయన ఆవెదన వ్యక్తం చేశారు. గత సారి అధికార, విపక్షం మధ్య గెలుపు తేడా కేవలం చాల స్వల్పమని, ఇపుడు పదిహేను శాతం మించిపోయిన ఈ నకిలీ ఓట్ల మూలంగా ఇంక ఓటేసి ప్రయోజనం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు వెంటనే బోగస్ నకిలీ ఓట్లను ఏరివేయకపోతే ఎన్నికలు పెట్టినా ప్రయోజనం ఉండదని ఆయనా అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: