ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది.  ఈ నేపథ్యంలో అన్ని పార్టీల అధినేతలు రంగంలోకి దిగారు.  వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ని ఓడించాలన్న పంతంతో ఉన్న టికాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే.  ఆ పార్టీ ప్రచారం కోసం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహూల్ గాంధీ ఆయన తల్లి సోనియాగాంధీ మేడ్చల్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న విషయం తెలిసిందే.  ఇక టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ సైతం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 
Image result for trs korangal meeting kcr
కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన కొంగర కలాన్ సభ హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు తీరని నష్టం మిగిల్చింది. సెప్టెంబరు 2న కొంగర కలాన్‌లో టీఆర్ఎస్ ‘ప్రగతి నివేదన సభ’నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సభా స్థలం పక్కనే ఔటర్ రింగ్ రోడ్డు ఉండడంతో సభ నిర్వహణకు టీఆర్ఎస్ హెచ్ఎండీఏ అనుమతి కోరింది. అంతే కాదు ఆ రోజు లోల్ ఫ్రీ వసూళ్లను నిలిపివేయాలని కోరింది. అయితే టోల్ ఫ్రీ నిలిపివేయడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పడంతో..టోల్ వసూళ్ల ద్వారా రోజుకు రూ. 87 లక్షల రూపాయలు తాము చెల్లిస్తామని చెప్పారు.
Image result for trs korangal meeting kcr
అయితే ఒప్పందం ప్రకారం హెచ్ఎండీఏకు టీఆర్ఎస్ ఆ మొత్తాన్ని చెల్లించిందా? అంటూ సీపీఎం గ్రేటర్ కార్యదర్శి శ్రీనివాస్ సమాచార హక్కు చట్టం కింద హెచ్ఎండీఏను కోరారు.  అయితే దీనికి సమాధానంగా ప్రస్తుతం వరకు  హెచ్ఎండీఏ రూ. 59.83 లక్షలు మాత్రమే చెల్లించినట్టు తెలిపింది. అంటే రూ. 27.17 లక్షలను హెచ్ఎండీఏ నష్టపోయిందన్నమాట. ఈ లెక్కన పార్టీ ప్రచారం కోసం టీఆర్ఎస్ తమ ఇష్టాను సారంగా వ్యవహరిస్తుందని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: