తెలగాణా ఎన్నికల్లో ఆంధ్రా రాజకీయం పండుతోంది. అక్కడ వేస్తున్న అడుగులు ఇక్కడ ప్రతిద్వనిస్తున్నాయి. ఇక్కడి చంద్రబాబు పోయి అక్కడ కాంగ్రెస్ ని కౌగిలించుకున్నపుడు ఇక్కడ ఆయన వైరి పక్షం వైసీపీ అక్కడ ఏం చేస్తుందన్నది అందరి మదిలో మెదిలే ప్రశ్న. తెలంగాణాలో బాగా ఓటు బ్యాంక్ ఉండి గత ఎన్నికల్లో మంచి స్థాయిలో ఓట్లు సాధించిన వైసీపీ రూట్ ఇపుడు ఎటూ.. ఇదే చర్చ అంతటా సాగుతోంది.


రాజన్న భక్తులది అదే మాట:


ఇక తెలంగాణా ఎన్నికల్లో రాజన్న భక్తులు అంటే వైసీపీ అభిమానుల ఓటు కచ్చితంగా మహా  కూటమికి వ్యతిరేకంగా వెళ్తుందని అంటున్నారు. వారంతా సహజంగాంగానే టీడీపీని, చంద్రబాబుని వ్యతిరేకిస్తున్నారు. బాబు అక్కడ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ పార్టీకి కూడా  ఓటు  వేయకూడని వైసీపీ అభిమానులు డిసైడ్ అయిపోయారు. వారంతా ఇపుడు మహా కూటమి ఓటమిని గట్టిగా కోరుతుంటున్నారు. అంటే అర్ధం ఆ వోట్లు టీయారెస్ కే పడుతాయనేగా అర్ధం. 


ఇదీ బలం :


కాగా, వైసీపీ తెలంగాణలో మూడు స్థానాల్లో విజయం సాధించింది. సెటిలర్ల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఎల్బీనగర్ లో 19 వేల ఓట్లు, మల్కాజిగిరిలో 15 వేల ఓట్లు, కూకట్ పల్లిలో 22 వేలు, శేరిలింగంపల్లిలో 24 వేలు, కుత్బుల్లాపూర్ లో 27 వేలు, జూబ్లీ హిల్స్ లో 10 వేలు, ఖైరతాబాద్ లో 24 వేలు, ఉప్పల్ లో 16 వేలు, సికింద్రాబాద్ లో 11 వేల ఓట్లను ఆ పార్టీ సాధించింది. అంటే సెటిలర్లలో వైసీపీకి అనుకూలంగా ఉండేవారు కూడా ఉన్నారని దీనిని బట్టి తేలుతోంది.


బాహాటంగా  పిలుపు :


ఇక ఇటీవల కాలంలో వైసీపీ అభిమానుల పేరిట సమావేశాలు జోరుగా జరుగుతున్నాయి. అందులో చెప్పెదేంటంటే ఇక్కడ టీయారెస్ కచ్చితంగా గెలవాలి. ఆ గెలుపు వల్ల టీడీపీకి, బాబుకు దెబ్బ పడాలి. ఇక్కడ టీయారెస్ గెలిస్తే అక్కడ ఏపీలో వైసీపీ విజయానికి ఆ పార్టీ పూర్తిగా సహకరిస్తుంది. అందువల్ల ఇవి జగన్, రాజన్న అభిమానులకు పరీక్షగా  ఉండే ఎన్నికలు, సీమాంధ్రుల ఓటు ఎక్కడ చెల్లా చెదురు కారాదు, మొత్తం టీయారెస్ కి పడేలా చూడాలి అంటూ అభిమానులు పిలుపు ఇస్తున్నారంటె తెలంగాణా రాజకీయం ఏపీతో ఎంతలా ముడిపడి ఉందో తెలిసిపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: