అవును ఇఫుడందరిలోను ఇదే చర్చ మొదలైంది.  సంవత్సరాల తరబడి జగన్మోహన్ రెడ్డిని టిడిపి ఆర్దిక ఉగ్రవాదిగా ముద్ర వేసేసింది.  జగన్ ఆర్ధిక ఉగ్రవాది ఎలా అయ్యారంటే అందుకు చంద్రబాబునాయుడు, నారా లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు చాలా లెక్కలే చెబుతారు. ఆర్దిక అవకతవకలకు పాల్పడ్డారని, క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఇలా..చాలానే చెబుతారు. అలాగని చెప్పి జగన్ పై సిబిఐ, ఈడి, ఐటి కేసులు నమోదు చేసింది. ఆ కేసులన్నీ కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ ఒక్క కేసులో కూడా జగన్ తప్పు చేశారని తీర్పు రాలేదు. అయినా టిడిపి దృష్టిలో జగన్ ఆర్ధిక ఉగ్రవాదే. చంద్రబాబుకు మద్దతిచ్చే మీడియా కూడా జగన్ పై అదే విధంగా ముద్రవేసి అచ్చేస్తోంది.


ఇక ప్రస్తుత విషయానికి వద్దాం. చంద్రబాబుకు బినామీగా ప్రచారంలో ఉన్న నేత, టిడిపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఎగొట్టారు. బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకుని సుజానా ఎగొట్టిన మొత్తం సుమారు 8 వేల కోట్లని ఓ అంచనా. వ్యాపారాల పేరుతో వేల కోట్లు తీసుకుని సుజనా ఆ డబ్బంతా ఏం చేశారు ? ఏం చేశారంటే 126 షెల్ కంపెనీలు పెట్టి దారిమళ్ళించారట. మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారని ఈడి అనుమానిస్తోంది. అనుమానాలకు తగ్గ ఆధారాలు కూడా దొరుకుతున్నాయనుకోండి. అందుకే ఈనెల 27వ తేదీన చెన్నై కార్యాలయంలో  విచారణకు హాజరవ్వాలంటూ ఈడి సుజనాకు నోటీసులు కూడా ఇచ్చింది. పైగా సుజనాపై లుకౌట్ నోటీసు కూడా జారీ చేసింది. 


తమ దగ్గర రుణాలు తీసుకుని సుజనా ఎగొడుతున్నట్లు బ్యాంకులే ఫిర్యాదు చేశాయట. దాంతో కేంద్ర దర్యాప్తు సంస్ధలన్నీ విచారణ నిమిత్తం రంగంలోకి దిగాయి. దాంతో చంద్రబాబుతో పాటు మొత్తం టిడిపిలోనే ప్రకంపనలు మొదలయ్యాయి.  బ్యాంకుల డబ్బు ఎగొట్టారంటే అర్ధం ప్రజాధనం దిగమింగారనే కదా ? మరి వేల కోట్ల ప్రజాధానాన్ని మింగేసిన సుజానాను ఏమని పిలవాలి ? ఆర్ధిక ఉగ్రవాది అని కాదా ? పలానా కేసులో ఆర్ధిక అవకతవకలకు పాల్పడ్డారని కోర్టు ఏ కేసులోను తీర్పు ఇవ్వకపోయినా జగన్ పై ఆర్దిక ఉగ్రవాది అని ముద్రేసినపుడు వేల కోట్ల రాపాయల రుణాలు ఎగొట్టారని బ్యాంకులే సుజనాపై ఫిర్యాదు చేశాయి కదా ? సుజనా ఆర్దిక అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ కూడా అవుతోంది కదా ? మరి అటువంటప్పుడు సుజానాను ఆర్దిక ఉగ్రవాది అని ఎందుకు పిలవకూడదనే చర్చ మొదలైంది.

Image result for sujana chowdary

తప్పులన్నీ తమ దగ్గరే ఉంచుకుని ఎదుటి వాళ్ళపై బురదచల్లటం చంద్రబాబు అండ్ కో కు బాగా అలవాటే. దానికి తగ్గట్లుగానే చంద్రబాబుకు మద్దతుగా నిలబడే మీడియా కూడా వంత పాడుతుండటంతో బురద చల్లుడు రాజకీయం చాలా బ్రహ్మాండంగా సాగుతోంది. ఒకపుడు జగన్ కేసుల్లో సిబిఐకి ప్యారలల్ గా విచారణ జరిపిన పచ్చ మీడియా ఇపుడు మాత్రం అసలు ఏమీ పట్టనట్లే వ్యవహరిస్తోంది. అంటే సుజనా అనే వ్యక్తి చంద్రబాబుకు బినామి అని వైసిపి  చేస్తున్న ఆరోపణలు నిజమన్నట్లే ఉంది. దానికితోడు మొన్న మరో రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ మీద ఐటి దాడులు జరిగినపుడు కూడా టిడిపి మీడియా పెద్దగా పట్టించుకోలేదు.


తాజాగా సుజనానే 126 షెల్ కంపెనీలు పెట్టారనటానికి ఈడికి ఆధారాలు కూడా దొరికాయి. షెల్ కంపెనీలకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు, లెటర్ ప్యాడ్లు దొరికాయి. అంతేకాకుండా సుజనా వాడుతున్న 6 లగ్జకీ కార్లు కూడా షెల్ కంపెనీల పేరుపైనే ఉన్నాయట. అందుకే కార్లను కూడా ఈడి సీజ్ చేసింది. 27న విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చిన ఈడి తర్వాత స్టెప్ ఏమి తీసుకుంటుందనే విషయంలో అందరిలోను ఉత్కంఠ మొదలైంది


మరింత సమాచారం తెలుసుకోండి: