సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లోక్‌సత్తా పార్టీలో చేరారు. సొంత పార్టీ పెట్టే ఆలోచనను ఆయన విరమించుకున్నారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల్లో చేరవచ్చు  అంటూ ఆయనపై పుకార్లు వచ్చాయి. సీబీఐ మాజీ జేడీ రాజకీయ రంగ ప్రవేశంపై రోజుకొక వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో ఆయన కొత్త పార్టీని ప్రకటిస్తు న్నారని, 26న దీనికి సంబంధించిన జెండా, అజెండా వెల్లడిస్తారని ప్రచారం జరిగింది.వాటన్నింటికీ చరమగీతం పాడుతూ లోక్‌సత్తా పార్టీలో తాను చేరుతున్నానంటూ లక్ష్మీనారాయణ సోమవారం ప్రకటించారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. 
Image result for VV Lakshminarayana & LOksatta Jayaprakash narayana
తాజాగా లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాన్ని విరమించుకుని ఉనికిలో ఉన్న పాత పార్టీకే కొత్తగా అధ్యక్షుడు అవుతాడని వార్తలు వనిపిస్తున్నాయి. మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ స్థాపించిన లోక్‌సత్తా సారథ్య బాధ్యతలను లక్ష్మీనారాయణ తీసుకుంటారని తెలిసింది. ఈ రోజు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయం అధికారికంగా వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న వి వి లక్ష్మీనారాయణ డిప్యూటేషన్‌ పై సీబీఐ జాయింట్ డైరెక్టర్‌ (జెడి) గా బాధ్యతలు స్వీకరించి, సత్యం కంప్యూటర్స్, జగన్ అక్రమాస్తుల కేసు, గాలి జనార్థన్ రెడ్డి మైనింగ్ కేసులను సమర్ధవంతంగా డీల్ చేసి సంచలనం సృష్టించారు.
 Related image
ఐపీఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తున్నానంటూ సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వీవీ లక్ష్మీనారాయణ చేసిన ప్రకటన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్లో ముఖ్యంగా యువతలో అమితాసక్తిని రగిల్చింది. ఆయన ఏ పార్టీ లోకి వెళ్తారో నని అని అనేక రకాలుగా ప్రజల్లో చర్చలు జరిగాయి. చివరకు తానే ఒక పార్టీ స్వంతంగా   ఏర్పాటు చేస్తారని అప్పట్లో ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.  
Image result for VV Lakshminarayana & LOksatta Jayaprakash narayana

సీబీఐ జేడీ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న లక్ష్మీనారాయణ వ్యవసాయం ప్రాధమయంగా రైతు సమస్యలపై ఇప్పటికే అనేక జిల్లాల్లో పర్యటించారు. అలాగే జీరో బడ్జెట్‌, గ్రామ సచివాలయంపై, యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేసి నిజాయితీ గల అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. డిప్యూటేషన్ కాలం పూర్తికావడం తో ఆయన తిరిగి మహారాష్ట్ర వెళ్లిపోయారు. అయితే ప్రజాసేవ చేయాలనే లక్ష్యం ఆయనను సమాజం నుండి దూరం చేయలేక పోయింది దాంతో స్వచ్ఛంద పదవి విరమణ చేశారు.
Image result for VV Lakshminarayana & LOksatta Jayaprakash narayana
అప్పటి నుంచి ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో విద్యార్ధులు, రైతులు, మేధావులు, యువత వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకున్న ఆయన "జనధ్వని" జెడి శబ్ధం ప్రతిద్వనించే పేరుతో కొత్త పార్టీని ప్రకటిస్తున్నారని, మరోపేరు వందేమాతరం కూడా ప్రచారంలోకి వచ్చింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన విషయాలు వెల్లడిస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కొత్త పార్టీ కాకుండా, లోక్‌సత్తా పార్టీ సారథ్య బాధ్యతలు స్వీకరిస్తా రంటూ వార్తలు వస్తుండటంతో రాజకీయ వర్గాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
Image result for jayapradha hansika - jayasudha payal rajput
ఆదివారం లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ (జేపీ) తో వి వి లక్ష్మీనారాయణ సమావేశమైన విషయం తెలిసిందే. అలాగే తాజా రాజకీయ పరిస్థితులపై సోమ వారం మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో ఆయన చర్చలు జరిపారు.  తర్వాత కొత్త పార్టీ పెట్టే ఆలోచనను లక్ష్మీనారాయణ విరమించుకున్నారు. చివరకు లోక్‌సత్తా పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ, అధికారమంటే ప్రజలను దోచుకోవడం కాదని, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేయాలన్నారు. అలాగే జెపి సలహాలు సహాయ సహకారం ఎల్లవేళలా అధ్యక్షుడు లక్ష్మి నాత్రాణకు అందుబాటులో ఉంటాయని తెలుస్తుంది.  

Image result for VV Lakshminarayana & LOksatta Jayaprakash narayana

మరింత సమాచారం తెలుసుకోండి: