తెలంగాణలో ఎన్నిలకు దగ్గర పడుతున్న సమయంలో పార్టీ అధినేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.  తాము నాలుగేళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ది పనులు చేశామని..ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై బాగా నమ్మకం ఉందని..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తమ పార్టీ చేసిన పోరాటం ఇంకా వారి గుండెల్లోనే ఉందని వచ్చేది తమ ప్రభుత్వమే అని టీఆర్ఎస్ అధినేతలు అంటున్నారు.  ఇక ప్రత్యర్థి పార్టీ అయిన టి కాంగ్రెస్  మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. 

తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..ప్రధాని మోదీని చూస్తేనే ముఖ్యమంత్రి కేసీఆర్ లాగు తడుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.  ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించడం ఖాయమని... ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫాంహౌస్ కు, కేటీఆర్ అమెరికాకు పోవడం ఖాయమని అన్నారు.   తెలంగాణ ఇవ్వడాన్ని పార్లమెంటులో మోదీ పార్లమెంటులో తప్పుబట్టారని అన్నారు. అన్ని పార్టీల నేతలను కొనుక్కున్న నీచ చరిత్ర కేసీఆర్ ది అని చెప్పారు.

టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సామాన్యులు బతకలేరని అన్నారు.  అభివృద్ది పేరు చెప్పి అడ్డగోలుగా దోచుకున్నారే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు.   తెలంగాణలో ఏ అభివృద్ధిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకున్నారో కేసీఆర్ చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చెప్పారు. జనాలను తప్పుదోవ పట్టించేందుకు కేసీఆర్ పిట్ట కథలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.  విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా సక్రమంగా ఇవ్వలేదని మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి, తానే గద్దెనెక్కాడని విమర్శించారు. 

 ప్రాజెక్టులలో తీసుకున్న కమిషన్ ను... ఇప్పుడు కేసీఆర్ పంచుతున్నారని మండిపడ్డారు. సోనియాగాంధీ వద్దనుకుని ఉంటే తెలంగాణ వచ్చేది కాదని చెప్పారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ కూడా చెప్పారని తెలిపారు. ఓటమి భయంతోనే మహాకూటమిపై కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా తెలంగాణను నిలిపారని మండిపడ్డారు. ప్రభుత్వం కంటే ప్రతిపక్షమే మంచి పాత్ర పోషించిందని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: