పవన్ కళ్యాన్ ఈ మధ్య చాలా పవర్ పుల్ గా మాట్లాడుతున్నారు. ఒక ప్రక్క చంద్రబాబును మరో పక్క వైఎస్ జగన్ ఇంకో ప్రక్క మోడీని మాటల్తో చీల్చి చెండాడేస్తున్నారు. ఆయన ప్రజలకిచ్చిన ప్రశ్నిస్తానన్న మాట నిలబెట్టుకోలేదని మాత్రం ఈ సందర్భంగా జనం గుర్తు చేస్తున్నారు.


విపక్ష నేత జగన్‌ కోడికత్తి పై రాద్ధాంతం, రాజకీయం చేశారు. కానీ, నేను అలా చేయను. నా భద్రతా సిబ్బంది వాహనాన్ని ఇసుక లారీ ఢీకొట్టింది. వాహనంలోని 8మంది గాయపడ్డారు. మరికొన్ని గంటల్లోనే హైదరాబాద్‌లో మా నాయకుడు నాదెండ్ల మనోహర్‌ వాహనాన్ని కూడా ఇసుక లారీ కొట్టింది. మేం వైఎస్ జగన్ లా గోల చేయలేదు’ అని జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Image result for lorry hit janasena nadendla manohar car 

ఒక కోడి కత్తి గుచ్చి నందుకు 'గుచ్చారో! గుచ్చారో!' అని వైఎస్ జగన్ గోల చేశారన్నారు. వచ్చి పోరాటం చేయండి. బయటకు వచ్చి తోలు తీయండి. ఆ ధైర్యం మీకు లేదు అని జగన్‌ ను ఎద్దేవా చేశారు.

 Related image

తూర్పు గోదావరి జిల్లా మండపేట లో శుక్రవారం ఆయన బహిరంగ సభ నిర్వహించారు. ‘‘జగన్‌కు సమస్యలు పట్టవు. ఆయన చట్టసభలకు వెళ్లరు. ఎమ్మెల్యేలను కాపాడుకోలేని జగన్‌ పక్కకు తప్పుకోవాలి. మేం వస్తాం. జగన్‌లా భయపడుతూ రోడ్ల మీద తిరిగే వ్యక్తిని కాదు. నేను జగన్మోహనరెడ్దిలా పారిపోను’’ అని పవన్‌ పేర్కొన్నారు.

 

మాజీ ప్రధాని పీవీ నరసింహరావు భౌతిక కాయాన్ని ఢిల్లీ నుంచి హైదరాబాదు తరలించి అంత్యక్రియలు మధ్యలోనే వదిలేశారని పవన్‌ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ వదిలి ఏపీకి వచ్చేశారు. చంద్రబాబు, జగన్‌ తెలంగాణలో తిరగలేరు. ఎక్కడైనా తిరిగే సత్తా నాకు మాత్రమే ఉంది. తెలంగాణలోఆంధ్రు లకు అండగా ఉన్నది నేనే అని పవన్‌ తెలిపారు. చంద్రబాబు భవిష్యత్తులో జగన్‌ తో పొత్తు పెట్టుకోవడానికి కూడా వెనుకడుగు వేయరని ఎద్దేవా చేశారు. ‘‘పంచభూతాలను దోచుకుంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులు చింతకాయల్లా రాలిపోతారు. టపాకాయల్లా పేలిపోతారు. సీఎంకి వయసు పెరిగి పోయింది. పాలనకు పని చెయ్యరు అని అన్నారు. నాదెండ్ల మనోహర్‌కు భద్రత కల్పించాలని నెలక్రితం దరఖాస్తు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని పవన్‌ విమర్శించారు.

 

తమ పార్టీ నేతలకు ఏమైనా జరిగితే దానికి డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘‘ఐదురోజుల క్రితం రాజానగరం యాత్రకు వెళ్తా ఉంటే ఇసుక లారీ వచ్చి నా కారును దాటి కాన్వాయ్‌ని గుద్దింది. అదే రోజున హైదరాబాద్‌లో దిగి ఇంటికెళ్తుండగా నాదెండ్ల మనోహర్‌ కారును మరో ఇసుక లారీ గుద్దేసింది. ఇది యాదృచ్ఛిక మో, ఉద్దేశపూర్వకమో అన్నది పోలీసులకే వదిలేశాం.

Image result for pawan ap Dgp

బాబూ! లోకేశ్‌ మీరు పార్టీని నడిపేవ్యక్తి. ఇలాంటి కుతంత్రాలకు పాల్పడితే ఎలా? పోలీస్‌ శాఖను, డీజీపీని వేడుకుంటున్నా. మీకు మరక పడితే మంచిది కాదు  అందుకే అశాంతి రాకుండా చూడండి. ఒకసారి అశాంతి వస్తే ఎవరి చేతుల్లో ఉండదు’’ అని పవన్‌ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: