మైనారిటీలను ఏమార్చటంలో ఇద్దరు చంద్రులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. వీళ్ళకి చట్టాలు చుట్టాలు కావాలను కుంటారు కాని ఇప్పుడు అవన్నీ చట్టుబండలు ఔతున్నాయి. ఆ విషయం అమిత్ షా తన ఎన్నికల ప్రచారంలో బహిరంగంగానే వ్యక్తపరచారు. రిజర్వేషన్లను భారత రాజ్యాంగం ఏనాడో నిర్వచించింది. ఈ లౌకిక ప్రజా స్వామ్యరాజ్యంలో మతపరమైన రిజర్వేషణ్లను ఏరకంగానూ, ఏరూపంలోను, అంగీకరించరాదని రాజ్యాంగ నిర్మాతలలో ఒకరైన బిఆర్ అంబేడ్కర్ అభిప్రాయబడ్డారు. 
Image result for mim trs alliance & Muslim reservations
మతపరమైన రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని బిజెపి అద్యక్షుడు అమిత్ షా చెప్పారు. ఎన్నికల ప్రచార సభలలో ఆయన మాట్లాడారు. టిఆర్ఎస్ ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని అనడంపై ఆయన స్పందించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదని రాజ్యాంగ నిపుణులు చెప్పే మాట.  అది నిర్వివాదాంశం. విద్య, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు మొత్తం మీద 50 శాతానికి మించకూడదని భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది. 
Image result for mim trs alliance & Muslim reservations
మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వదలచుకుంటే ఓబిసి, ఎస్సీ, ఎస్టీ, బిసిల రిజర్వేషన్లకు ఎసరు పెడతారా? దీనిపై తెలంగానా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమే సమాధానం చెప్పవలసి ఉంటుంది. మైనారిటీ రిజర్వేషన్లను బీజేపీ అమలు చేయదు. మిమ్మల్ని అమలు చేయనివ్వదని అని అమిత్ షా అన్నారు. చట్టం అనుమతించ ని రిజర్వేషన్లను కెసిఆర్ ఎలా వాగ్ధానం చేశారు? ఎమైఎం ఎలా నమ్మింది. చట్టం అనుమతించని రిజర్వేషణ్లను ముస్లిం సోదరులు ఆశించరన్న భావాన్ని వ్యక్తపరచారు. కెసిఆర్ రాజ్యాంగాన్ని నిర్దేశించగలరా? అని అమిత్ షా అడిగీ అడిగినట్లుగా అన్నా ప్రజలకు సూటిగానే అర్ధమైంది.  

Image result for mim trs alliance & Muslim reservations

మరింత సమాచారం తెలుసుకోండి: