ఈ మధ్య పవన్ స్పీచ్ ల లో జగన్ మీద విమర్శలు వాన పెరిగింది.  అయితే ఇంత వరకు పవన్ జగన్ ను పెద్దగా టార్గెట్ చేసింది లేదు ఇప్పడూ ఉన్నట్టుండి ఒంటి కాలు మీద లేస్తున్నాడు. అయితే తానే సీఎం అని భావించే పవన్ కళ్లు ఇటీవల వచ్చిన కొన్ని సర్వేలు తెరిపించాయి. వాటిలో జనసేనకు షాకింగ్ ఫలితాలు కనిపించాయి. ఓట్లు గాని సీట్లు గాని 4-6 శాతానికి మించవని తేలడంతో పవన్ కళ్యాణ్ రెండు ప్రణాళికలు వేసుకున్నారట. అందుకే కొంతకాలం క్రితం వరకు పవన్ కళ్యాణ్ జగన్ ను ఒక్కమాట కూడా అనేవాడు కాదు.

Image result for pavan and jagan

కానీ ఇటీవల పవన్ జగన్ పై ఒంటికాలి మీద లేస్తున్నాడు. పదేపదే ఆరోపణలు చేస్తున్నాడు. ఎందుకిలా అంటే... పవన్ వద్ద ప్లాన్ ఎ - ప్లాన్ బి ఉన్నాయని చెబుతున్నారు విశ్లేషకులు.ప్లాన్ ఎలో భాగంగా ఎలాగైనా వైసీపీతో పొత్తు పెట్టుకుని ఓ 30 సీట్లు అడగాలి... వైసీపీ బలం తోడుగా ఉంటే వాటిలో 20-25 సీట్లు అయినా గెలుచుకోవచ్చు అన్నది పవన్ ప్లాన్. ఆ ప్రయత్నాల వల్లే తెలుగుదేశాన్ని పదేపదే తిట్టే పవన్ జగన్ విషయంలో పెద్దగా స్పందించేవారు కాదు.  అయితే ఈ ప్రతిపాదనను వైసీపీ తోసిపుచ్చింది.

Image result for pavan and jagan

దీంతో వేరే మార్గం లేక  పవన్ ప్లాన్ బి అమలు చేస్తున్నాడని అంటున్నారు.. అదేంటంటే... అధికార పార్టీతో పాటు - వైసీపీ మీద కూడా దాడి చేసి ఉతికి ఆరేస్తే తటస్థులు తన పట్ల ఆకర్షితులు అవుతారనేది  అతని ఆలోచన. అంటే అచ్చం ప్రజారాజ్యం పార్టీ అవలంభించిన విధానం అన్నమాట. ఇలా చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను జనసేన వైపు తిరుగుతాయని ఆలోచనట. తద్వారా కొన్ని సీట్లు గెలిచి తర్వాత.. చంద్రబాబు గారు అయితేనే రాష్ట్రాన్ని గాడిని పెట్టగలరని నాకు అనిపిస్తోంది అంటూ ఎంచక్కా టీడీపీతో జట్టు కట్టొచ్చని పవన్ యోచిస్తున్నారట. పవన్ లో జగన్ పై సడెన్ మార్పునకు కారణం ఇదే అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: