సినిమాల్లో కాంబినేషన్లు ఎలా పనిచేస్తాయో రాజకీయాల్లోనూ పొత్తులు ఎత్తులు అలాగే వర్కౌట్ అవుతాయి. ఒక్కొసారి ఎన్ని జిత్తులు వేసిన పొత్తులు ఫెయిల్ అవుతూంటాయి. అంటే ఆ కాంబినేషన్ జనాలకు ఎక్కలేదన్నమాట. మరి ఓటరు దేవుళ్ళు నచ్చే మెచ్చే కాంబోలను వండడంలో స్పేషలిస్ట్ గా పేరున్న ఓ రాజకీయ పార్టీ తాజాగా మరో పార్టీలో పొత్తు పెట్టుకుంది. ఈ రెండు పొత్తుల పట్ల ఇపుడు జనంలో సర్వామోదం లభించినట్లుగా ఆ పార్టీ హైకమాండ్ చెప్పుకుంటోంది.


చేయి కలిపితే లాభమే:


తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం అంటే సర్వత్రా మొదట్లో  వ్యతిరేకత వచ్చింది. అంతెందుకు సొంత పార్టీలోనే నోళ్ళు నొక్కుకున్నారు. దాంతో ఈ పొత్తు వికటిస్తుందని కూడా విపక్షాలు పిల్లి శాపాలు పెట్టాయి. ఎవరెన్ని పెట్టినా సర్వేలనే నమ్ముకునే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దీనిపైన కూడా భారీ ఎత్తున జనం నుంచి అభిప్రాయ‌ సేకరణ చేయించారట. ఆ సర్వేలో ఏకంగా 84 శాతం మంది ఈ రెండు పార్టీలు కలవడంలో ఎటువంటి తప్పూ లేదని చెప్పారట.


మనం గెలిచేస్తున్నాం :


రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఏపీలో అడుగులు వేయాలనుకుంటున్న టీడీపీ ఈ పొత్తులపై వచ్చే  సర్వే ఫలితాలను నేతలకు చూపించి జనంలో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఏమీ లేదని చెప్పుకుంటోంది. మనం సరైన దారిలోనే వెళ్తున్నామని కూడా సమర్ధించుకుంటోంది. టీడీపీకి అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ శత్రువైతే, ఇపుడు అక్కడ ఉన్న బీజేపీ శత్రువు. ఇదే విషయాన్ని జనం కూడా నమ్మబట్టే మనకు మద్దతుగా 84 శాతం మంది తీర్పు చెప్పారని అధినాయకత్వం సంబరాలు చేసుకుంటోంది.


ఆ ఫలితాల తరువాతే:


ఇక తెలంగాణాలో ఎన్నికల ఫలితాలు డిసెంబర్  11న్ వస్తాయి. ఆ ఫలితాలు అచ్చంగా  జనాభిప్రాయాన్ని వెల్లడిస్తాయని టీడీపీ తమ్ముళ్ళు అంటున్నారు. సర్వేల సంగతి ఎలా ఉన్నా అక్కడ కనుక మహా కూటమి గెలిస్తే హ్యాపీగా ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవచ్చునని కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కాంగ్రెస్ తో చేయి కలిపిన టీడీపీ తమ్ముళ్లను ఆ దిశగా తీసుకెళ్ళేందుకు సర్వేలను  గట్టిగా నమ్ముకుంటోంది



మరింత సమాచారం తెలుసుకోండి: