వ‌చ్చే ఏడాది మేలో ఏపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉంది. అయితే, సీఎం చంద్ర బాబు మాత్రం ఎన్నిక‌ల తాయిలాల‌ను ప్ర‌క‌టించేస్తున్నారు. వాస్త‌వానికి ఆయ‌న వీటికి ఎన్నిక‌ల తాయిల‌మ‌ని పేరు పెట్ట‌క పోయినా.. చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు, ఎన్నిక‌ల‌కు ఉన్న స‌మ‌యంలో లేవ‌నెత్తుతున్న ప్రాజెక్టులు వంటి విష‌యానికి వ‌స్తే.. ఇలానే అనిపిస్తుంది. తాజాగా చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గానికి 2 వేల ఇళ్లు నిర్మిస్తామ‌ని, రాబోయే రోజుల్లో త‌ల‌దాచుకునేం దుకు ఏ పేద‌వాడు ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని తాము నిర్ణ‌యించుకున్న‌నామ‌ని చెప్పారు. అయితే, ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగు నెల‌లే ఉండ‌డం, బాబు ఇలా ఇప్పుడు వ్యాఖ్య‌లు చేయ‌డం విస్మ‌యానికి గురి చేసింది. ఎన్టీఆర్‌ గ్రామీణ గృహనిర్మాణ పథకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి రెండు వేలకు తగ్గకుండా ఇళ్లు కేటాయించనున్నట్లు  చంద్రబాబు ప్రకటించారు. 


2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.6,649 కోట్ల వ్యయంతో 4 లక్షల ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడిం చారు. ఆ ఆర్థిక సంవత్సరం నుంచి ఎస్టీ లబ్ధిదారులకు అదనంగా రూ.50 వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. వాస్త‌వా నికి ఆ ఆర్థిక సంవ‌త్స‌రం అంటే.. కొత్త ప్ర‌భుత్వం వ‌స్తుంది. అది బాబుదే ఎందుకు కావాలి? అనేది మ‌రో ప్ర‌శ్న‌. ఈ నేప థ్యంలో బాబు ఎన్నిక‌ల వేళ ఇస్తున్న కొత్త ఇళ్ల నిర్మాణం ఎప్పుడు సాకారం అవుతుంది? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర శ్న‌. పదివేలకు పైగా జనాభా ఉన్న మండల కేంద్రాలు, పంచాయతీల్లో జీ ప్లస్‌ త్రీ పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేపట్టాల న్నారు. 2018-19లో వివిధ పథకాల కింద మొత్తం 5.46 లక్షల ఇళ్లు కేటాయించగా వాటిలో 2.50 లక్షల నిర్మాణం పూర్త యిందని తెలిపారు. అయితే, వీటిలో కేవ‌లం ల‌క్ష ఇళ్లు మాత్రమే ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు చేరాయి. 


మ‌రి ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌క‌టన‌ను ఎన్నిక‌ల జిమ్మిక్కుగానే భావించాల్సి ఉంటుంద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌లు కీల‌క‌మైనవి కావ‌డం, నాయ‌కులు కూడా ఎవ‌రికి వారు పోటీ ప‌డుతుండ‌డం గెలు పు గుర్రం ఎక్క‌డం అంత ఈజీకాద‌ని తేలిపోవ‌డంతోనే అలివి మీరిన హామీల‌తో ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. 2018-19 ఇళ్ల ల‌క్ష్యం దాదాపు ఐదున్నర ల‌క్ష‌లు కాగా.. దీనినే ఇప్ప‌టి వ‌ర‌కు స‌గానికి కూడా లాక్కురాలేక పోయిన చంద్ర‌బాబు ఇలా ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గానికి రెండు వేల ఇళ్లు అంటే దాదాపు మ‌రో 3.5 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించాల్సి ఉంటుంది. దీనికి నిధులు ఎక్క‌డ నుంచి తెస్తారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఏదేమైనా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ధ్యేయంగా బాబు ఇస్తున్న హామీల‌పై ప్ర‌జ‌లు విస్తు పోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: