రాజ‌కీయాల్లో ప‌రిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితినైనా మార్చుకునే శ‌క్తి నాయ‌కుల‌కు అవ‌స‌రం. ముఖ్యంగా కీల‌క‌మైన ఏపీలో రాజ‌కీయాలు రోజుకోరకంగా మారుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ఉద్ధండులైన మేధావులు సైతం ఏపీలో ఎవ‌రికి అధికారం వ‌స్తుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. అంతేకాదు, ఏపీలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో కూడా చెప్ప‌లేని ప‌రిస్తితి! దీంతో నాయ‌కులు ఎవ‌రికి వారు వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ముందుకు సాగుతున్నారు. తాజాగా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వ‌చ్చేఎన్నిక‌ల‌పై గుబులు ప‌ట్టుకుంది. కొణిద‌ల ఫ్యామిలీకి రాజ‌కీయాలు స‌రిపోవ‌ని, వారు అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మ‌ని స‌ర్వేలు చెప్ప‌డంతో ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్తితిలో ప‌డ్డాడు ప‌వ‌న్‌. 


పార్టీ ప్రారంభించిన స‌మ‌యంలోను ఆ త‌ర్వాత కూడా ప‌వ‌న్ ఎప్పుడూ త‌న‌కు సీఎం కావాల‌ని ఉంది. . అని ఎక్క‌డా అన లేదు. కానీ, ఇటీవ‌ల కాలంలో మాత్రం ఆయ‌న త‌న వ్యూహాన్ని మార్చుకుని ఎక్క‌డ ఏవేదిక ఎక్కినా .. త‌న‌కు సీఎం ప‌ద‌విపై దృష్టి ఉంద‌ని చెబుతున్నాడు. ఓ కానిస్టేబుల్ కొడుకు సీఎం కాకూడ‌దా? అంటూ సెంటిమెంట్ రాజ‌కీయాలు చేస్తున్నాడు. అయితే,దీని వెనుక పెద్ద హిస్ట‌రీనే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఓట్లు గాని సీట్లు గాని 4-6 శాతానికి మించవని తేలడంతో పవన్ కళ్యాణ్ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుత‌న్నారు. త‌న ప‌రిస్థితి అన్న చిరంజీవి క‌న్నా ఘోరంగా త‌యారైతే.. ప‌రిస్థితి ఏంట‌ని త‌ల్ల‌డిల్లిపోతున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ రెండు ప్రణాళికలు వేసుకున్నారట. అందుకే కొంతకాలం క్రితం వరకు పవన్ కళ్యాణ్ జగన్ ను ఒక్కమాట కూడా అనేవాడు కాదు. కానీ ఇటీవల పవన్ జగన్ పై ఒంటికాలి మీద లేస్తున్నాడు.


దీనివెనుక ప‌వ‌న్ పెద్ద వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నార‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. ఎలాగూ త‌న‌కు ఒంట‌రిగా వెళ్తే.. ఓట్లు రాలే ప‌రిస్తితి లేదుక‌నుక‌..  వైసీపీతో పొత్తు పెట్టుకుని ఓ 30 సీట్లు అడగాలి... వైసీపీ బలం తోడుగా ఉంటే వాటిలో 20-25 సీట్లు అయినా గెలుచుకోవచ్చు అన్నది పవన్ ప్లాన్. ఆ ప్రయత్నాల వల్లే తెలుగుదేశాన్ని పదేపదే తిట్టే పవన్ జగన్ విషయంలో పెద్దగా స్పందించేవారు కాదు.  అయితే ఈ ప్రతిపాదనను వైసీపీ తోసిపుచ్చింది. దీంతో వేరే మార్గం లేక అధికార పార్టీతో పాటు - వైసీపీ మీద కూడా దాడి చేసి ఉతికి ఆరేస్తే తటస్థులు తన పట్ల ఆకర్షితులు అవుతారనేది  అతని ఆలోచన. తద్వారా కొన్ని సీట్లు గెలిచి చక్రంతి ప్పాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడు. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్‌.. జ‌గ‌న్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: