తెలంగాణలో ఎన్నికల ప్రచార నిమిత్తం నిజామాబాద్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నాలుగున్నరేళ్లు జరిగిన టిఆర్ఎస్ పాలన పై ఆయన నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.  తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు..దాంతో కార్యకర్తల్లో ఆనందోత్సాహలు వెల్లివిరిసాయి.   పవిత్రమైన గోదావరి నీటిని తాగుతూ, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ దేవి కరుణా కటాక్షాలను పొందిన ఈ ప్రాంత ప్రజలు ఎంతో అదృష్టవంతులని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మండుతున్న ఎండల్లోనూ బీజేపీని ఆశీర్వదించేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారని అన్నారు.

నిజామాబాద్ యువశక్తిని ఈ సందర్భంగా తాను గుర్తు చేసుకుంటున్నానని చెబుతూ, ఇదే ప్రాంతానికి చెందిన గిరిజన బిడ్డలు మాలావత్, పూర్ణలు 13 ఏళ్ల ప్రాయంలోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని, ఇప్పటివరకూ తాను నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లానని, ఇప్పుడు తెలంగాణకు వచ్చానని మోదీ అన్నారు. తెలంగాణ ప్రజలు కన్న కలలన్నీ సాకారాం కావడం లేదు. వాటిని నెరవేర్చాల్సిన స్థానంలో ఉన్న ప్రభుత్వం ఆ పని చేయట్లేదు.
Image result for pm modi nizamabad
ఈ ముఖ్యమంత్రి, ఆయన పార్టీ ఎలా ఉందంటే… అన్నీ సగం సగం చేసి వదిలి పెట్టడం తప్పా ఏది కూడా పూర్తిగా చేయచేతకాదు.  చివరకు పదవీ కాలాన్ని కూడా మధ్యలోనే ముగించారని ఎద్దేవా చేశారు. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ఉన్నారంటే, జ్యోతిష్యం, జాతకాలు, నిమ్మకాయల దండలు, మిరపకాయలను ఎంతో నమ్ముకున్నారు. దేశంలో 50 కోట్ల మందికి ఆరోగ్య భద్రతను కల్పించే ఆరోగ్య పథకాన్ని పేదలకు అందకుండా చేసిన ఘనత ఈయనది. మోదీ పేరున ఉన్న పథకం అమలైతే తనకు నష్టమన్న భావనలో ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారు.
Image result for bjp
ఆయన అభద్రతా భావంతో ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.   తెలంగాణ ఏర్పడి నాలుగున్నరేళ్లు అయింది. ఈ ప్రభుత్వం ఏం పని చేసింది. ఇది ఎన్నికల సమయం. ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం ఏం చేసిందన్న విషయం పైసాపైసా లెక్క అడగాల్సిన సమయం ఇది. ఇక్కడి యువత, రైతులు, దళితులు, బడుగు బలహీన వర్గాలు, ఆదివాసీల అభ్యున్నతికి ఇచ్చిన హామీల్లో ఏం నెరవేర్చారు? ఏం అభివృద్ధి సాధించారు? వాగ్దానాల అమలులో ప్రభుత్వ వైఫల్యంపై  కేసీఆర్ సమాధానం చెప్పి తీరాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: