పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేనిదే జగన్ మీద పిచ్చి పిచ్చి గా కనీసం లాజిక్ లు కూడా మరిచి పోయి మాట్లాడ్తున్నాడు. అయితే  చంద్రబాబు అవినీతిలో జగన్ కు వాటా అని అనేశాడు పవన్ కల్యాణ్. పక్కనే ఉన్న నాదెండ్ల మనోహర్ ఈ గైడెన్స్ చేశాడో ఏమోకానీ.. ఈ ఆరోపణతో పవన్ కల్యాణ్ తన తీరును మరింత మలిన పరుచుకున్నాడ. పవన్ చేసిన ఆరోపణలో సంబద్ధత ఎంత? అనేది చిన్న పిల్లాడికి అయినా అర్థం అయ్యే విషయమే. అంత వాటాలు వేసుకునే పరిస్థితే ఉంటే.. జగన్ మీద ఎందుకు హత్యాయత్నం జరుగుతుంది.. అనేది కామన్ సెన్స్ ఉన్న వాడికి వచ్చే సందేహం. అయితే పవన్ కల్యాణ్ కు అలాంటి సెన్స్ తో పనిలేదు. ఆ పూటకు ఏదో మాట్లాడేయాలి. అందుకే అలా మాట్లాడి ఉండవచ్చు.


షాక్ : పవన్ కు జగన్ 30 సీట్లు ఇవ్వను పో అన్నాడా ... అందుకే పవన్ విమర్శల జోరు...!

ఇప్పుడు కలుగుతున్న అసలు సందేహం ఏమిటంటే.. చంద్రబాబుతో నాలుగేళ్ల పాటు సత్సంబంధాలు నెరిపింది పవన్ కల్యాణ్. గత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. చంద్రబాబుతో అనేకమార్లు సమావేశం అయ్యాడు పవన్ కల్యాణ్. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఇరుకునపడ్డాడో అప్పుడంతా జనం ముందుకు వచ్చి కొత్త షో షురూ చేస్తూ వచ్చింది ఈయనే. చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోతున్న సమయంలో పవన్ వచ్చి ఏదో హడావుడి చేసి.. జనాలను డైవర్ట్ చేస్తూ వచ్చాడు.


షాక్ : పవన్ కు జగన్ 30 సీట్లు ఇవ్వను పో అన్నాడా ... అందుకే పవన్ విమర్శల జోరు...!

అది రాజధాని భూముల కుంభకోణం సమయంలో అయినా అయినా.. చంద్రబాబు మీద కాగ్ అక్షింతలు వేసిన సందర్భంలో అయినా.. మరే సందర్భంలో అయినా.. పవన్ వచ్చిందల్లా బాబు గ్రాఫ్ పడిపోతూ ఉన్నప్పుడే. పవన్ కల్యాణ్ అప్పట్లో ఎక్కడ పర్యటించాలన్నా.. అక్కడ తెలుగుదేశం నేతలే ముందస్తుగా ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. ప్రత్యేక విమానాలు పెడుతూ వచ్చారు. ఇక మరికొన్ని సార్లు డైరెక్టుగా తెలుగుదేశంనేతల ఇళ్లకు వెళ్లి ఆతిథ్యం తీసుకున్నాడు పవన్ కల్యాణ్, చివరి సారిగా అనంతపురం వెళ్లినప్పుడు.. పరిటాల సునీత, వరదాపురం సూరి మొదలుకుని.. ఆఖరికి ఫిరాయింపు ఎమ్మెల్యే చాంద్ భాషా ఇంటికి వెళ్లి కూడా విందులు తీసుకుని వచ్చాడు పీకే. ఇలా టీడీపీతో అంత సాన్నిహిత్యంగా గడిపాడు. ఈ మధ్యనే టీడీపీని విమర్శిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: