ఎన్నికల ముందు హైకోర్టు తెలుగుదేశంపార్టీకి పెద్ద షాక్ ఇచ్చింది. పోయిన ఎన్నికల్లో అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం ఎంఎల్ఏగా ఎన్నికైన ఈరన్న ఎన్నిక చెల్లదంటూ తీర్పిచ్చింది. అఫిడవిట్లో క్రిమినల్ కేసుల విషయాన్ని దాచిపెట్టటం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించటమేనంటూ తీర్పిచ్చెప్పింది. అంతే కాకుండా అప్పటి ఎన్నికల్లో వైసిపి తరపున పోటీ చేసి ఓడిపోయిన తిప్పేస్వామినే ఎంఎల్ఏగా కోర్టు ప్రకటించటం గమనార్హం.

 

పోయిన ఎన్నికల్లో టిడిపి తరపున ఈరన్న, వైసిపి తరపున తిప్పేస్వామి పోటీ చేశారు. అయితే, ఎన్నికల అఫిడవిట్లో ఈరన్న వ్యక్తిగత వివరాలు దాచిపెట్టారని తిప్పేస్వామి ఫిర్యాదు చేశారు. అయితే, అప్పటి రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదు. దాంతో వైసిపి అభ్యర్ధి కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన న్యాయమూర్తి తిప్పేస్వామి వాదనతో ఏకీభవించారు. అభ్యర్ధి క్రిమినల్ కేసులను దాచిపెట్టటం ఎన్నికల నిబంధనల ప్రకారం తప్పేనంటూ అంగీకరించింది. అదే విషయాన్ని ఈరోజు తీర్పిస్తు ఎంఎల్ఏ ఎన్నిక చెల్లదంటూ కొట్టేసింది.

 

ఈరన్నపై నాలుగు క్రిమినల్ కేసులున్నాయి. కర్నాటకలో దాఖలైన ఓ కేసులో శిక్ష  కూడా పడింది. అదే విధంగా ఏపిలో రెండు కేసులున్నాయి. అందులో ఒక కేసులో చార్జిషీటు కూడా దాఖలైంది. అంతేకాకుండా ఆయన భార్య కర్నాటక రాష్ట్రంలోని అంగన్ వాడి విభాగంలో ఉద్యోగి. ఆ విషయాన్ని కూడా ఈరన్న దాచిపెట్టారు. తిప్పేస్వామి ఫిర్యాదులో ఆ విషయాలన్నీ రుజువవ్వటంతో ఈరన్న ఎన్నికను కోర్టు కొట్టేసింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: