అతి దగ్గరలోనే తెలంగాణ ఎన్నికలు. సమయం దగ్గరపడుతున్న కొద్దీ బారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇవాళ  ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ తో పాటు మహబూబ్ నగర్ లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో టీఆర్ఎస్ పాలనతో పాటు గత కాంగ్రెస్ పాలనపై  విమర్శల వర్షం కురింపించారు. బిజెపి అభ్యర్థులను గెలిపించాలని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు సూచించారు. 


తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చార వేడిని ద్విగుణీకృతం చేస్తూ  ప్రధాని నరేంద్ర మోడీ తొలిస‌భ కొనసాగింది. నిజామాబాద్‌లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్‌రావును లక్ష్యంగా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరితోనే ఇక్కడి ప్రజలు నష్టపోతున్నారని ప్రధాని తెలిపారు.
Image result for narendra modi in nizamabad mahabubnagar

కాంగ్రెస్ తరహాలోనే రాష్ట్రాన్ని పాలించొచ్చని కేసీఆర్ భావిస్తున్నారని ఎద్దేవా చేసిన ఆయన. నిజామాబాద్‌ను లండన్‌లా మారుస్తామని కేసీఆర్ చెప్పారు. కానీ, కనీస సదుపాయాలు కల్పించలేకపోయారు. లండన్ ఎలా అభివృద్ధి చేశారోనని నేను హెలికాప్టర్ నుంచి చూశా!  నిజామాబాద్ కనీస అభివృద్ధికి నోచుకోలేదని నాకు అర్థమైందని మండిపడ్డారు.


తెలంగాణ‌ ఏ పని కూడా పూర్తి చేయలేదు. ఆఖరికి ఐదేళ్లు పాలన కూడా పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలతోనైనా ప్రజలకు ఈ ప్రభుత్వం నుంచి విముక్తి లభించనుండడం ఆనందించాల్సిన అంశంమన్నారు. ఇంటింటికీ గోదావరి నీళ్లు ఇస్తాం లేని పక్షంలో ఓట్లు అడగడానికి రానని కేసీఆర్ అన్నారు. మరి మాట నిలుపుకోలేకపోయిన సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందని మోడీ అన్నారు. 

Related image
కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు పార్టీలూ కుటుంబ పార్టీలేనని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. బీజేపీ ది ఓకే మంత్రం “సబ్ క సాత్ సబ్ కి వికాస్” ఓటు బ్యాంకు రాజకీయాలు దేశ అభివృద్ధికి ఆటంకం అన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి ఒకప్పుడు యూపీఏ లో మంత్రి, మేడం రిమోట్ కంట్రోల్‌తో నడిచిన ప్రభుత్వంతో ఆయన పనిచేశారు. కాంగ్రెస్‌తో తెలంగాణలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారని ఆరోపించారు. 

ఇక్కడ ప్రజల కోసం కృషి చేసి పార్టీ.. కొట్లాడే పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేసిన ప్రధానమంత్రి టీఆర్ఎస్ కుటుంబ పార్టీ, కేసీఆర్ పరివార్ వాదీ అన్నారు. కాంగ్రెస్‌ కూడా కుటుంబ పార్టీయే, మొన్న జరిగిన సభలో సోనియా, ఆయన కుమారుడు ఒకే వేదికపై ఉండి టీఆర్ఎస్‌ను కుటుంబ పార్టీ అని ఎలా విమర్శించారని, అవి రెండూ కుటుంబ పార్టీలేనని మండిపడ్డారు. 
Image result for narendra modi in nizamabad mahabubnagar

పూజలు, యాగాల మీద పెట్టిన శ్రద్ద సీఎం కేసీఆర్ ప్రజల మీద పెట్టడం లేదని మోడీ మండిపడ్డారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌కు తేడా లేదు... నాణానికి రెండు వైపులా అన్నట్టు గా ఆ రెండు పార్టీలు ఉన్నాయని మోడీ ఆరోపించారు. అబద్దాలు ఆడడంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటీ పడుతున్నాయని మండిపడ్డారు. ఇక ఎన్డీఏ ప్రభుత్వంలో 6 కోట్ల కొత్త గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇస్తే అందులో తెలంగాణ లో 5 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించారు మోడీ. నాలుగు లక్షల ఇళ్లకు తెలంగాణలో సౌభాగ్య పథకం కింద కరెంట్ కనెక్షన్ ఇచ్చామని తెలిపిన ప్రధాని, నిజామాబాద్ లో 15 వేల కనెక్షన్ లు ఇవ్వడం జరిగిందన్నారు. 


ప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రజలకు అందాలి. నేను తిననివ్వను అని చెప్పాను. కమిషన్ వ్యవస్థను రూపుమాపామన్నారు   6 కోట్ల బోగస్ లబ్ధిదారులను తొలగించి లూటీని ఆపామని ప్రధాని మోడీ వెల్లడించారు.

 Image result for narendra modi in nizamabad mahabubnagar

పేద వాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తే పరిస్థి ఎలా ఉంటుందో మనకు తెలుసున‌ని, కానీ, ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే సరైన వైద్యం అందడం లేదని మోడీ అన్నారు. దేశంలో 50 కోట్ల మంది ప్రజలకు వైద్యం కోసం ఆయుష్మాన్ యోజన తెచ్చాం.  కానీ, అలాంటి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకపోవడంతో ఇక్కడి ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: