యవ్వారం చూస్తుంటే అవును అలాగే కనిపిస్తోంది. తెలంగాణాలో ఎన్నికలు మంచి కాకమీదున్నాయ్. మరో 10 రోజుల్లో ప్రచారం కూడా పూర్తయిపోతోంది. అయినా తెలుగుదేశంపార్టీ యువకిశోరం, చంద్రబాబునాయుడు వారసుడు, కాబోయే సిఎంగా ప్రచారం చేయించుకుంటున్న నారా లోకేష్ మాత్రం ఇంత వరకూ తెలంగాణా గడ్డపై అడుగే పెట్టలేదు. పైగా అవసరమైతే తాను తెలంగాణా ఎన్నికల్లో ప్రచారానికి రెడీ అంటు విశాఖపట్నంలో చెప్పటం విచిత్రంగా ఉంది. అవసరమైతే అంటే అర్ధమేంటి ? ఈ ఎన్నికలు టిడిపికి చావో రేవో లాంటివి. ఇంత కీలకమైన ఎన్నికల్లో కూడా అవసరమైతే అని చెప్పి ప్రాచారం చేయటానికి లోకేష్ వెనకాడుతున్నారు.

 

నిజానికి లోకేష్ ప్రచారం చేయాల్సిన అవసరమైతే లేదు. ఎందుకంటే, తెలంగాణాలో అడుగుపెట్టటానికి చంద్రబాబే భయపడుతున్నారు. కెసియార్ దెబ్బకు చంద్రబాబులో వణుకు మొదలైందన్నది వాస్తవం. అందుకే ప్రచారానికి రాకుండా మీన మేషాలు లెక్కిస్తున్నారు. మొన్నటి  సోనియా గాంధి, రాహూల్ గాంధిలు పాల్గొన్న బహిరంగసభలో కూడా చంద్రబాబు అడ్రస్ లేరు. చంద్రబాబు తెలంగాణాలో ప్రచారానికి మొహం చాటేస్తుంటే ఇక చినబాబు లోకేష్ ఎంత ?

 

ఎంత కాదనుకున్నా లోకేష్ మాటల్లోని డొల్లతనం అందరికీ తెలిసిందే. జన్మతహా తెలుగు వాడే అయినా తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడలేడు. పోనీ ఎన్నికల వ్యూహాల్లో ఆరితేరిన వాడా అంటే అదీ లేదు. తెరముందు కానీ తెరవెనుక కానీ ఎందులోను పనికిరాడు. ఏదో అదృష్టం కొద్దీ చంద్రబాబుకు కొడుకైపోయాడు కాబట్టి సరిపోయింది. ఏపిలో ఏదైనా సమావేశంలో మాట్లాడేటప్పుడే లోకేష్ బండారం బయటపడిపోతోంది. అటువంటిది హై టెన్షన్ పుట్టిస్తున్న తెలంగాణా ఎన్నికల్లో ప్రచారమంటే ఇంకేమన్నా ఉందా ? జిహెచ్ఎంసి ఎన్నికల్లో లోకేష్ చేసిన ప్రచారమే అందరికీ గుర్తుకొస్తోంది.

 

విచిత్రమేమిటంటే కుకట్ పల్లిలో పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్ధి సుహాసిని ప్రచారం విషయంలో చంద్రబాబు మీడియా ఎంతసేపు జూనియర్ ఎన్టీయార్, కల్యాణ్ రామ్ నే ప్రస్తావిస్తోంది. లోకేష్ వచ్చి సుహాసినికి ప్రచారం చేస్తాడని కానీ చేయడని కానీ ఎక్కడా పొరపాటున కూడా  ప్రస్తావించటం లేదు. అంటే సదరు మీడియాకు కూడా తెలుసు లోకేష్ సామర్ధ్యం ఏంటో. లోకేష్ గనుక నోరిప్పితే పడే నాలుగు ఓట్లు కూడా పడవన్న విషయం వాటికి కూడా అర్ధమయ్యే ఉంటుంది.

 

అందుకనే ఎంతసేపు జూనియర్, కల్యాణ్ ప్రచారం మీదే ఫోకస్ పెట్టాయి. చంద్రబాబు మీడియా ఉద్దేశ్యంలో  లోకేష్ ప్రస్తావన కూడా తీసుకురాకూడదు. సోదరి పోటీ చేస్తున్నా కూడా పట్టించుకోకుండా అవసరమైతే ప్రచారానికి రెడీ అంటున్నారంటే ఏదో మీడియా అడిగింది కాబట్టి చెప్పారే కానీ మనసులో మాత్రం వద్దనే అనుకునుంటారు. మొత్తానికి లోకేష్ సామర్ధ్యం గురించి ఎవరూ ప్రస్తావించకుండా చంద్రబాబు మీడియా భలే వెనకేసుకొస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: