పవన్ కళ్యాణ్ ఈ మధ్య జగన్ ఎప్పడు లేని విధంగా రెచ్చిపోతున్నాడు . మొన్నటివరకు చంద్ర బాబు మీద పడిన ఈ తిక్క పవన్ గారు ఇప్పుడేమో జగన్ మీద పడ్డారు. అయితే కొద్ది రోజులుగా ప‌వ‌న్ క‌ళ్యాన్ త‌న ప్ర‌సంగాల్లో జ‌గ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకొని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో.. ఇంకా ఉపేక్షిస్తే....ప్ర‌జ‌ల్లోకి వ్య‌తిరేక సంకేతాలు వెళ్తాయ‌ని వైసిపి నేత‌లు అంచ‌నాకు వ‌చ్చారు. దీంతో..ఇక ప‌వ‌న్ ను టిడిపి కి మిత్రుడుగా ప్ర‌చారం చేయాల‌ని..ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను అదే స్థాయిలో తిప్పి కొట్టాల‌ని డిసైడ్ అయ్యారు. దీంతో.. ఇక నుండి ప‌వ‌న్ వ‌ర్సెస్ జ‌గ‌న్ గా ఏపి రాజ‌కీయంలో కొత్త కోణం క‌నిపంచ‌నుంది. 

జ‌గ‌న్ - ప‌వ‌న్ పొత్తు..ఇక ఉత్తి మాటేనా..

జ‌గ‌న్ స్థానంలో తాను ఉంటే ఒక్క‌డిగా అయినా అసెంబ్లీ కి వెళ్లి ప్ర‌భుత్వ అవినీతి పై పోరాడేవాడిన‌ని ప‌వ‌న్ చెప్పుకొస్తున్నారు. జ‌గ‌న్ శ‌క్తి సామ‌ర్ధ్యాల పై మీద ప‌వ‌న్ అనేక విమ‌ర్శ‌లు చేసారు. ఇక‌, జ‌గ‌న్ అవినీతి పైనా..వేల కోట్లు దోచుకున్నారంటూ..16 నెల‌లు జైళ్లో ఉన్న వ్య‌క్తి ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి ఎలా అర్హుడ‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నిస్తున్నారు. త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి జ‌గ‌న్ ప్ర‌శ్నిస్తున్నార‌ని.. తాను జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త విష‌యాలు బ‌య‌ట పెడితే త‌ట్టుకోలేర‌ని హెచ్చ‌రిస్తున్నారు. దీని పై వైసిపి శిబిరం లో అంత‌ర్మ‌ధ‌నం జ‌రిగింది. చంద్ర‌బాబు తో మిత్రుడుగా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న స‌మ‌యంలో ప‌వ‌న్ పై వైసిపి నుండి అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే విమ‌ర్శ‌లు వినిపించేవి. కానీ, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌..ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు త‌గిన రీత‌లో స్పందించ‌కుంటే న‌ష్ట‌మేన‌ని వైసిపి అంచ‌నాకు వ‌చ్చింది. దీంతో..ఇక టిడిపి తో స‌మానంగా ప‌వ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకోవాల‌ని వైసిపి నిర్ణ‌యించింది. 

ప‌వ‌న్ ను వ‌దిలేస్తే న‌ష్టమే..

ప‌వ‌న్ క‌ళ్యాన్ ను టిడిపికి మేలు చేసే వ్య‌క్తిగానే ప్రచారం చేయాల‌ని వైసిపి డిసైడ్ అయింది. 2014 ఎన్నిక‌ల స‌మ‌యం లో ప‌వ‌న్ జ‌గ‌న్ - వైయ‌స్ ను ఉద్దేశించి అనేక ఆరోప‌ణ‌లు చేసారు. కానీ, ప‌వ‌న్ ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌నే భావ‌న‌తో వైసిపి నేత‌లు ప‌వ‌న్ ను విస్మ‌రించారు. అప్ప‌ట్లో ష‌ర్మిళ మాత్ర‌మే ప‌వ‌న్ ను విమ‌ర్శించారు. కానీ, ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ కార‌ణంగా టిడిపి లాభ‌ప‌డింద‌ని ఆ త‌రువాత వైసిపి నేత‌లు గుర్తించారు. ఈ సారి మాత్రం ఎక్క‌డా ప‌వ‌న్ ను విస్మ‌రించ‌కుండా..టిడిపి తో స‌మానంగా కార్న‌ర్ చేయాల‌ని డిసైడ్ అయ్యారు. ప‌వ‌న్ త‌న ప్ర‌సంగాల్లో అధికారంలో ఉన్న పార్టీని కాకుండా..ఎక్కువ‌గా త‌నను విమ‌ర్శించ‌టాన్ని జ‌గ‌న్ సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: