అరుదైన సీన్లు ఎపుడో కానీ కనిపించవు. సినిమాల్లోనూ మల్టీ స్టారర్ అంటూ రేర్ కాంబోలతో మూవీ డిజైన్ చేస్తూంటారు. అది జనాల్లో క్యూరియాసిటీని బాగా పెంచుతుంది. మరి రాజకీయ తెరపైన అలాంటి విన్యాసాలు చాలానే జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని హిట్లు, మరి కొన్ని ఫట్లు అవుతాయి. ఏది ఏమైనా అలాంటి  ద్రుశ్యాలు చూసేందుకు, మాట్లాడేందుకు  మాత్రం చాలా బాగుంటాయి.


రాహుల్ తో చేయి కలిపి :


అలా ముందుకుపోతున్నాం, ఇదీ చంద్రబాబునాయుడు పడి కట్టు పదం. ఇపుడు కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలసి అలా ముందుకు పోతున్నాము తమ్ముళ్ళూ అంటూ బాబు పిలుపు ఇస్తున్నారు. ఈ రోజు ఆయన తెలంగాణాలో ఓ అరుదైన సీన్ క్రియేట్ చేయబోతున్నారు. ఖమ్మం గుమ్మం వేదికగా రాహుల్ తో చేయి కలిపి ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. ఈ ఇద్దరు కర్నాటకలో కన్ను కొట్టుకున్నారు. హస్తినలో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఖమ్మంలో చెట్టా పట్టాల్ వేయబోతున్నారు. మరి తెలంగాణా ఎన్నికల్లో ఇది  హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.


మూడు సభలతో ముందుకు :


ముందుగా ఖమ్మం మీటింగ్ ఈద్గా గ్రౌండ్స్ లో  జరుగుతుంది. దానికి బాబు, రాహుల్  బాబు కలసి హాజరవుతారు. ఇద్దరు కలసి పాల్గొనె తొలి మీటింగ్ కావడంతో ఏర్పాట్లు ఘనంగా జరిగిపోతున్నాయి. ఇక్కడ టీడీపీకి, కాంగ్రెస్ కి , వామపక్షాలకు కూడా బాగానే బలం ఉండడం, మూడు మహా కూటమిగా ఉండడంతో ఈ మీటింగు పైన అందరి కళ్ళు ఉన్నాయి. ఆ తరువాత హైదరాబాద్ లోని సనత్ న‌గర్ మీటింగులోనూ, ఆ మీదట నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే మరో మీటింగులోనూ బాబు, రాహుల్ కలసి ప్రసంగాలు  చేస్తారు


 ఈ మీటింగులతో కాంగ్రెస్, టీడీపీ చిర కాల వైరం మరచి రెండు పార్టీల కేడర్ కి కూడా ఒక్కటిగా పని చేయాలని క్లారిటీ ఇస్తారని అంటున్నారు. మరి. అది ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి. మొత్తానికి రాహుల్ తో స్కీన్ షేర్ చేసుకుని చంద్రబాబు అటు తెలంగాణా, ఇటు ఏపీ తమ్ముళ్ళకు మనది ఇపుడు ఇదే రూట్ అని మరింత పక్కాగా చెబుతున్నారన్నమాట.
 



మరింత సమాచారం తెలుసుకోండి: