మొత్తం దేశంలో లోక్-సభ స్థానాలు 545. అందులో 25 లోక్-సభ స్థానాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. 25 కు 25 స్థానాలు గెలుచు కున్నా మన లోక్-సభ సభ్యుల శాతం 4.59 మాత్రమే. అంటే 5 శాతం లోపే. ఇంత అతి తక్కువ సభ్యులతో పార్లమెంట్ లో మన గొంతు వినిపించే అవకాశం బహుస్వల్పం.

Related image

పోనీ మన ముఖ్యమంత్రి చండప్రచండడు రాజకీయ దురందరుడు, యుగందరుడు, అని మన రాష్ట్రంలో ఒక సామాజిక వర్గం, దానికి చెందిన మీడియా, వారివారి అంతె వాసులు అనుకున్నా, దేశంలో మాత్రం అన్నీ పార్టీలకు అంటరాని పార్టీ తెలుగుదేశం దాని అధినేత. ఎందుకంటే జాతీయ ప్రజాస్వామిక సంఘటన (ఎన్డిఏ) లో చేరి బిజెపి తో నాలుగేళ్ళకుపైగా అంటకాగి ఒక్కసారిగా రాజకీయ అవకాశాల కోసం వెంపర్లాడి బయటపడిన సంగతి, ఆ పార్టీ నాయకుణ్ణి నోరు నొప్పెట్టేలా పొగిడిన తీరు ఎవరూ మరచి పోలేరు. శాసనసభలో చేసిన తీర్మానాలు ఇవ్వన్నీ, చిన్న విషయాలు కావు కదా!  దేశం మొత్తం లోని బిజెపి వ్యతిరేఖ పక్షాలు అన్నింటికీ బాగా తెలుసు.

Related image

ఇప్పుడు బిజెపి వ్యతిరెఖ ప్రాంతీయపార్టీల్లోని ప్రతి అధినేత ప్రధానమంత్రి కావాలని కలగనే వారే. కలలు ఎవరు కనరు? వ్యూహాలెవరు పన్నరు? అందరూ వారివారి స్థాయి లో అత్యంత సమర్ధులే. లేకుంటే ఆయా రాష్ట్రాల్లో అధికారలోకి ఎలా రాగలిగారు? ఇక్కడ చంద్రబాబుకు వేరే వారికి తేడా స్వంత సామాజికవర్గ మీడియా మద్దతు మాత్రమే. వేరే రాష్ట్రాల్లో అయితే ఈ మీడియా మద్దతు మొత్తం ఆ రాష్ట్ర ప్రాంతీయపార్టీకి లేదా దాని అధినేతకు దక్కే పరిస్థితులులేవు. ఏ ప్రాంతీయ పార్టీ అధినేత అధికారంలో ఉన్నా ఏపిలో లాగా  ₹1000 కోట్లు సమర్పయామి అంటూ మీడియాకు దారాదత్తం చేశారన్న వినికిడిగాని, చరిత్రగాని కనిపించదు. వినిపించదు.

Image result for Indira gandhi fatal Defeat  - report in Enadu Telugu Daily

అందువలన తెలుగు దేశం పార్టీ,  అధినేత కులానికే స్వంతమైన ఈ మీడియా వినిపించె ప్రధానమైన మాట కేంద్రంలో చక్రం త్రిప్పటం. ఈ చక్రం త్రిప్పటం అనేది ఒక అభూత కల్పన. మెజారిటీ సభ్యుల అభిప్రాయం అక్కడనెగ్గుతుంది, చంద్రబాబు ఆ మెజారిటీ సభ్యుల గుంపులో గోవింద అనగానే మన సామాజిక వర్గ మీడియా కోళ్ళు, వేల గొంతుకలతో తమ స్వరాలను వినిపిస్తూ మనవాడు చక్రం త్రిప్పాడని ఒక నెలపాటు జనం చెవులు తుప్పు వదిలే లాగా హోరెత్తిస్థాయి.  

Related image

ముఖ్యంగా ప్రజా శ్రేయస్సు ఏ మాత్రం కోరని చంద్రబాబు రాజకీయాల ద్వారా మన జీవితాల్లో చేరి – మొత్తం వ్యవస్థలు అంటే మీడియా, వ్యాపారాలు, విఫణి, వైద్యం, విద్య, ఆరోగ్యం, గుత్తేదార్ల వ్యవస్థను వారికి దారాదత్తం చేశారని చెప్పక్కరలేదు. గతంలో యెల్లో జర్నలిజం అన్నా, యెల్లో పేపర్ అన్నా, అర్ధం వేరెగా ఉండేది. ఇప్పుడు అర్ధాలు మార్చెసేలా ఒక వర్గం మీడియా ప్రవర్తించటం మన తెలుగు జాతి దురదృష్టం. 

Image result for NTR while TDP successful win & comes to power first time

డిల్లీ వెళ్ళి శరద్ పవార్, శరద్ యాదవ్, లాలు ప్రసాద్ యాదవ్, అరవింద్ కేజ్రివాల్, మూలాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, ఇటు మమత బెనెర్జీ, ఎంకె స్టాలిన్, దెవేగౌడ, కుమార గౌడ, నవీన్ పట్నాయక్, కేరళ విజయన్ వీళ్ళంతా ఇప్పటికే బిజేపి వ్యతిరేఖులని వాళ్లకేకాదు డేశం మొత్తానికి తెలుసు. తిరిగి నేడు ఎన్ డి ఏ నుండి అవకాశవాదం తో బయట పడ్డ ఈ కొత్త బిచ్చగాడు ప్రతిపక్షాల ఐఖ్యత అంటూ కొత్త బొచ్చె పట్టుకొని బిచ్చమెత్తితే అంగీకరించటానికి ఈ హేమాహెమీ లంతా జోకర్లు కాదని అర్ధమవ్వట్లా?

Image result for NTR while TDP successful win & comes to power first time

అలా అర్ధమయ్యే కేసీఆర్ సైలెంట్ అయ్యాడు. చక్రం తిప్పుటాడని ‘నమస్తె తెలంగాణా’ ఎక్కడా రాయలేదు. "రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి ప్రభంజనం మొదలైంది. దేశంలో సర్వేలు అన్నీ టిడిపికి ఐదంటే ఐదు లోక్-సభ సీట్లు కూడా గెలవ లేదని చెపుతూ ఉన్న సమయంలో ప్రతిపక్షనేత జగన్మోహన రెడ్డిపై హత్యాయత్నాం" కేసు ముదురుతుండగా ప్రజల దృష్టి తప్పించటానికి చంద్రబాబు, టిడిపి నాయకులు, వీరికంటే ఎక్కువగా పచ్చ మీడియా ప్రయత్నిస్తున్నదని జగనే కాదు జగమే కోడై కూస్తుంది"

 Image result for NTR while TDP successful win & comes to power first time

ఇప్పుడీ మీడియా కాంగ్రెస్ ను గతంలో ఎలా దూషించిందో - నెహౄ కుటుంబాన్ని ముఖ్యంగా ఇందిరా గాంధి ధారుణ పరాభవం చెందిన నాడు ఇందిరపై ఈనాడు బానర్ ఐటంగా వేసిన "మహాభినిష్క్రమణం" నాటి పాఠకుల మనొఫకాల నుండి నేటికీ చెదిరిపోలేదు.

Image result for The Best & Memorable Photos Published in Enadu Paper during 1978

ఇప్పుడు ఆయింటి కుక్కమూతి పిందె రాహుల్ గాంధి మూతి చంద్రబాబు నాకుతుంటే, అదే మీడియా నేడు "మాతాతలు నేతులు తాగారు - ఇప్పుడు మీరు వాసన చూడండి" అంటూ చంద్ర బాబు బాగు కోసం, ఆయన కుటుంబం, టిడిపి, వారి కుల జనుల కోసం తమ అస్థిత్వాన్ని కోల్పోతూ "పచ్చ కుల ప్రసార మాద్యమాలు" అన్న అగౌరవాన్ని మిగుల్చుకోవటం  కోసం మాత్రమే ఈ మీడియా నాలుక మడతెస్తే, మడమ తిప్పితే - ఇప్పుడు పరువు ప్రతిష్ఠ కోల్పోయేది ఎవరిదో తెలియదా? 82 యేళ్ళ వయసులో వారి సామాజిక వర్గం తప్ప వేరే తెలుగువాళ్ల ఉసురు తగలదా? ఈ పాపం మూటగట్టుకోవటం ఆ రెండు మూడు మీడియా హౌజెస్ కు అవసరమా?  

Image result for The Best & Memorable Photos Published in Enadu Paper during 1978

ఈ సమయంలో సామాజికంగా ఉన్న ప్రధాన రాజకీయ ఆర్ధిక సామాజిక సమస్యలు మరుగున పడిపోతాయి. ఈ విధమైన పద్దతి ఈ మీడియా హౌజెస్ కు సుమారు నాలుగు న్నర దశబ్ధాల సాధన నుండి అలవడింది. "సాధనమున పనులు సమకూరు దరలోన అన్నట్లు, ఈ మీడియాకు రాయటం - "తినగ తినగ వేము తియ్యనగును" అన్నట్లు వీటి పాఠకులకు అలవాటు అయింది. దీంతో జనసామాన్యం ఈ మీడియా పెంచి పోషించే వార్తల రుచికి ఆ జిహ్వ చాపల్యం లేకపోతే బ్రతకలేని పరిస్థితి నెలకొంది. మన సిగ్గులేని తనం కాకపోతే తప్పులు లేకుండా మాట్లాడటమే చేతగాని నారా లోకెష్ నాయుణ్ణి మంత్రిగా అంగీకరించటమే కాకుందా, ఇంకొందరు వందిమాగధులు ప్రచారం చేస్తున్నట్లు నారా దేవాన్ష్ నాయుణ్ణి భావి ముఖ్యమంత్రి అనటం ఈ మీడియా రాతలు చేతలు కాక ఇంకే ముంది. 
Image result for chandrababu family photos
అందుకే ప్రజలు తిప్పికొట్టక ముందే, ఈ మీడియా హౌజెస్ కొంతైనా జాతి ప్రయోజనాలు గుర్తుంచుకుంటే మంచిది. రాజకీయాలు ప్రజా జీవితాన్ని మెరుగుపరచాలి గాని దిగజార్చ గూడదు. ఇంకా ఇలా కాలం గడుస్తుంటే "బెటర్ నాట్ టు రీడ్ దీస్ పేపర్స్ అండ్ సీ చానల్స్" అనే పరిస్థితులు రాకుండా చూసుకోవటం అభిమాన పాఠకులుగా మేం కోరుతున్నాం.   

Image result for chandrababu family photos

మరింత సమాచారం తెలుసుకోండి: