తెలంగాణా ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబునాయుడు కెసియార్ కు వ్యతిరేకంగా తెలుగుదశంపార్టీ, కాంగ్రెస్, జనసేన, సిపిఐ కలిసి కట్టుగా పనిచేయాలని చెప్పారు. ఖమ్మం బహిరంగ సభలో రాహూల్ గాంధితో పాటు కలిసి వేదికను పంచుకున్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, కెసియార్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, టిడిపి, జనసేన, సిపిఐ ఐక్యంగా కలిసి పనిచేయాలన్నారు. చంద్రబాబు ఆ మాటనగానే జనాల్లో నుండి పెద్ద ఎత్తున అరుపులు, ఈలలు వినిపించాయి. దాంతో కొన్ని సెకండ్లు గ్యాప్ ఇచ్చిన చంద్రబాబు మళ్ళీ మాట్లాడుతూ, తెలంగాణాలో జనసేన అంటూ మళ్ళీ చెప్పారు. బహుశా చంద్రబాబు ఉద్దేశ్యంలో తెలంగాణా జన సమితి అయ్యుండచ్చు. కానీ క్లియర్ గా జనసేన అని ఒకసారి గ్యాప్ ఇచ్చి తెలంగాణా జనసేన అని రెండో సారి అనటం గమనార్హం.

 

ఇంతకీ విషయం ఏమిటంటే గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎక్కడ మాట్లాడినా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేసుకుంటున్నారు. మామూలుగా అయితే ఏ ప్రతిపక్షమైనా అధికార పక్షాన్నే టార్గెట్ చేసుకుంటుంది. కానీ విచిత్రంగా పవన్ మాత్రం ప్రధాన ప్రతిపక్షాన్నే లక్ష్యంగా చేసుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నాలుగేళ్ళ పాటు చంద్రబాబు చంకలో కూర్చుని సిఎం చేసిన అడ్డుగోలు పనులన్నింటికీ మద్దతు తెలిపిన పవన్ విచిత్రంగా ఇపుడు చంద్రబాబును ఎదుర్కోవటంలో జగన్ విఫలమయ్యారని ఆరోపించటమే విడ్డూరంగా ఉంది.

 

పవన్ వైఖరి చూసిన వారందరికీ పవన్, చంద్రబాబు జేబులో మనిషే అన్న విషయంపై అనుమానాలు పెరిగపోతోంది. ఇదే అనుమానం చాలాకాలంగా ఉన్నప్పటికీ మధ్యలో చంద్రబాబు, లోకేష్ లక్ష్యంగా పవన్ ఆరోపణలు చేయటంతో నిజంగానే ఇద్దరికీ చెడిందా అన్న అనుమానం మొదలైంది. అయితే తాజా వైఖరితో తాను చంద్రబాబు మనిషే అన్న విషయాన్ని పవన్ చెప్పకనే చెప్పారు. దానికి తగ్గట్లుగా ఖమ్మం సభలో కూడా పొరబాటునో లేకపోతే మనసులో మాట బయటకు వచ్చేసిందో ఏమోగానీ జనసేన ప్రస్తావన తేవటంతో సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ డ్రామాలపై దుమ్మెత్తిపోస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: