రాజకీయ దురంధరుడు చంద్రబాబు పాలిటిక్స్ ముందు ఎవరైనా సలాం చేయాల్సిందే. ఆయన దూర ద్రుష్టితో చేసే పనులు, వేసే అడుగులు ప్రత్యర్ధులు తెలుసుకునిలోగానే ఆపరేషన్ పూర్తి అయిపోతుంది. వర్తమాన రాజకీయాల్లో చంద్రబాబు కంటే మించిన రాజకీయ చతురుడు వేరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో. నలభయ్యేళ్ల రాజకీయ‌ అనుభవం రంగరించుకున్న బాబు ముందు ఎంతటి వారైనా బలాదూరే మరి.


ఏపీ కాంగ్రెస్ బాబుదే :


ఇదిలా ఉండగా తాజాగా ఖమ్మం గుమ్మంలో జనం సాక్షిగా చేతులు కలపిన రాహుల్ బాబు అక్కడితో ఆగకుండా ఏపీ ఎన్నికల ముచ్చట్లపైన కూడా చర్చకు తెర లేపారట. బాబు ముందస్తుగా రాహుల్ చెవిలో ఓ మాట వేసేసి ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారట. దాని ప్రకారం చూస్తే ఏపీలో కాంగ్రెస్ తో కలసి నడవడమా, విడిగా పోటీ చేయడమా అన్నది పూర్తిగా బాబు ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. ఇక ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలన్నది కూడా బాబు కనుసన్నలల్లోనే జరిగిపోతుంది. ఓ విధంగా చెప్పాలంటే ఏపీ కాంగ్రెస్ బాబు చేతిలోకి వెళ్ళిపోయిందన్న మాట.


జాతీయమే ప్రధానం :


రాహుల్ విషయానికి వస్తే ఆయన పూర్తిగా జాతీయ రాజకీయాలపైనే ద్రుష్టి పెడుతున్నారు. ఏపీలో కూడా చెప్పుకోదగిన నాయకులు కానీ, పార్టీని జనంలో తీసుకుపోగల వారు కానీ లేరన్నది రాహుల్ కూడా బాగా తెలుసు. దాంతో వ్యూహ కర్త బాబుకే ఏపీ కాంగ్రెస్ ని కూడా నడిపించే బాధ్యతలు పరోక్షంగా  కట్టబెట్టేశారని టాక్. రేపటి ఎన్నికల్లో మోడీని, బీజేపీని గద్దె దించడమే అజెండా. అందుకోసం ఏదైనా చేయాలి. ఇదీ రాహుల్ స్ట్రాటజీ, బాబు సైతం దానికి అనుగుణంగానే అడుగులు వేస్తూ ఏపీ వరకూ తాను చూసుకుంటానని చెప్పడంతో రాహుల్ ఖుషీగా ఉన్నారనని అంటున్నారు.
 అంటే రేపటి రోజున టీడీపీ మళ్ళీ ఏపీలో గెలిచేందుకు ఏపీ కాంగ్రెస్ ను ఎలా ఉపయోగించుకోవాలో బాబుకే పూర్తి స్వేచ్చ ఉందన్న మాట. ఇక ఈ రోజు నుంచి  కాంగ్రెస్ నేతలు టికెట్ అంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ ని కాదు, చంద్రబాబుని ప్రసన్నం చేసుకోవాల్సి వస్తుంది. మొత్తానికి రాహుల్ ని బాబు బాగానే బుట్టలో వేశారని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: