ఎన్నికల్లో ఎన్నో సమీకరణలు ఉంటాయి. ప్రతి ఎన్నిక ఓ పాఠమే. ప్రతి పోరాటమూ ఓ గుణపాఠమే. గతంలో అలా జరిగిందని ఇపుడు అవే లెక్కలు తీస్తే పరీక్ష తప్పడం ఖాయం. రెండు రెండు నాలుగు అన్నది కేవలం గణితానికే తప్ప రాజకీయ గణితానికి పనికిరాదు. ఇపుడు తెలంగాణాలో భీకరమైన పోరు జరుగుతోంది. చూస్తూంటే ఇది ఏ వైపునకు టర్న్ తీసుకుంటుందా అన్న ఆసక్తికరమైన  చర్చ సాగుతోంది.


ఒక్క కేసీయార్ :


మరో ఎనినిది రోజుల్లో ప్రజల తీర్పునకు వెళ్ళబోతున్న తెలంగాణాలో తాజా రాజకీయ ద్రుశ్యం చూస్తూంటే ఓ వైపు ఒంటరిగా  కేసీయార్, మరో వైపు గుంపులుగా విపక్షాలు మోహరించి ఉన్నట్లుగా  కనిపిస్తోంది. అందరూ టీయారెస్ ని తిట్టేవారే, అందరూ కేసీయార్ని టార్గెట్ చేసేవారు ఇది వ్యతిరేక ప్రచారమా. అనుకూల ప్రచారమా అన్నది కాదిక్కడ, మొత్తం మీద తెలంగాణా ఎన్నికల సభల్లో కేసీయార్ పేరు రోజుకు కొన్ని వందల సార్లు మారుమోగుతోంది. ఓ విధంగా తెలంగాణా రాజకీయాలకు కేంద్ర బిందువుగా కేసీయార్ మారిపోయారు. 


యాంటీ ఇంకెంబెన్సీ ఓట్ల చీలిక :


ఇక ఈ సీన్ చూసుకుంటే తెలంగాణాలో కేసీయార్ నాలుగున్నరేళ్ళ పాలనలో వచ్చిన యాంటీ ఇంకెంబెన్సీని అన్ని రాజకీయ పార్టీలు తలా కొంచెం పంచుకుంటాయేమోనని అనిపిస్తోంది. కేసీయార్ కు పోటీగా జట్టు కట్టిన ప్రజా కూటమిలో పలు పార్టీలు ఉన్నాయి. అలాగే బయటకు వస్తే సీపీఎం నాయకత్వంలో బహుజన ఫ్రంట్ ఉంది. మరో వైపు బీఎస్పీ మాయావతి పార్టీ అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. ఇంకోవైపు బీజేపీ తరఫున మొత్తానికి మొత్తం సీట్లలో అభ్యర్ధులు రంగంలో ఉన్నారు.

ఇలా అన్ని పార్టీలు విడివిడిగా కలివిడిగా పోటీ చేస్తుండం ఓ విధంగా అధికార పార్టీకే శ్రీ రామ రక్ష అన్న అంచనాలు కూడా ఉన్నాయి. కేసీయార్ వర్సెస్ అదర్స్ గా ఈ ఎన్నికలు చూసుకున్నపుడు ఫలితాలు కూడా  గమ్మత్తుగా వచ్చే అవకాశం ఉంది.


ప్లస్ ఓట్లు ఇటే :


స్థూలంగా ఈ ఎన్నికల పోరును పరిశీలిస్తే కేసీయార్ నచ్చే వారి ఓట్లలో చీలిక లేదు. అంటే కేసీయార్ మళ్లీ సీఎం కావాలనుకునే వారి ఓట్లు అన్ని గుత్తమొత్తంగా కేసీయార్కే పడతాయన్నమాట. మరి కేసీయార్ నచ్చని వారి ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లు అన్నీ ఒక్కటిగా ఉన్నాయా, ఒక్కరికే పడతాయా అంటే ఇక్కడే అసలు చిక్కు వస్తోంది. ఈ ఓట్ల శాతం ఎక్కువేనని అనుకున్నా పంచుకోవడానికి పది పార్టీలు ఉన్నాయి. అవన్నీ కలసి ఓట్లు చీల్చేస్తే కేసీయార్ విజయం సులువు అవుతుందన్న విశ్లేషణలూ ఉన్నాయి.

ఓ విధంగా చెప్పాలంటే ఇంతకు ముందు కూడా ఇలాగే రాజకీయ లెక్కలు ఫలితాలను తేల్చాయి. ఇక అంతా కేసీయార్ ని తిడుతూంటే మరో వైపు ఆయనకు సానుభూతి కూడా వస్తోందని అంటున్నారు. ఒక్కడిని చేసి అంతా మీద పడిపోతున్నారన్న సెంటిమెంట్ కనుక పండితే కేసీయార్ విజయం ఆపడం ఎవరి తరం కూడా కాదని అంటున్నారు. మొత్తానికి ఎలా చూసుకున్నా తెలంగాణా ఎన్నికల్లో టీయారెస్ ఇప్పటికైతే సేఫ్ జోన్లోనే ఉందని లేటెస్ట్ సీన్ చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: