వైఎస్ జగన్ అడిగింది బాగానే ఉంది. అది జనం మనసులో కూడా ఉంది. కానీ రాజకీయ నాయకులు ఎన్నో చెబుతారు. ఎన్నికల ఏరు దాటగానే తెప్ప తగలేస్తారు. అటువంటిది. ఇపుడు వారు గ్యారంటీలు, పూచికత్తులు ఇస్తారంటే ఎవరూ నమ్మరు. వారు కూడా ఇవ్వరు. ఆ విషయంలో నాయకులు, పార్టీలు అన్నీ కూడా ఒక్కటే కదా. మరి ఈ సంగతి తెలిసి కూడా జగన్ అలా డిమాండ్ చేయడంలో ఆంతర్యం ఏంటి.


మొదట్లోనే మోసమా :


ప్రత్యేక హోదా ఏపీకి ఇస్తామని చెప్పి కాంగ్రెస్, బీజేపీ రెండూ మోసం చేశాయి. ఇదీ జగన్ వాదన. నిజమే. కాంగ్రెస్ చివరి నిముషంలో అదీ బీజేపీ పట్టుపడితే రాజ్యసభలో అప్పటి పీఎం మన్మోహన్ సింగ్ ఓ ప్రకటన చేశారు. హోదా అయిదేళ్ళ పాటు ఇస్తామని. మరి ఆ తరువాత దాన్ని అలాగే ఉంచేశారు. కనీసం విభజన చట్టంలో కూడా పెట్టలేదు. వీలుంటే పరిశీలిస్తామని అన్నారని తాజాగా జగన్ చెప్పడం కూడా ఆసక్తికరమైన అంశమే.
 అంటే ప్రత్యేక హోదా మొదట్లోనే ఎన్నో పిల్లి మొగ్గలు వేసిందన్న మాట. ఇపుడు మళ్ళీ హోదా ఇస్తమాని కాంగ్రెస్ నాయకులు ఏపీకి వస్తున్నారు. జనం నమ్మాలా వద్దా అన్న ఆలొచనలో ఉన్నారు. మరి ఈ టైంలో గురి చూసి జగన్ బాణం వేశారు.


బాండ్  పేపర్లపైన :


ముందు హోదా విషయంలో కాంగ్రెస్ సహా హామీ ఇచ్చే పార్టీలు బాండ్  పేపర్ పై సంతకం చేయాలని జగన్ డిమాండ్ చేశారు.. అలా కనుక చేస్తే ఏపీలో  తమ పార్టీని 25 ఎంపీ సీట్లలో గెలిపిస్తే. ప్రత్యేక హోదా ఇస్తామని కాగితంపై సంతకం చేసి ఇచ్చే పార్టీకే మద్దతిస్తామని ప్రకటించారు. ‘అది కాంగ్రెస్‌ కావచ్చు. మరే పార్టీ అయినా కావచ్చు’ అని జగన్ చెప్పుకొచ్చారు. ఇది మంచి డిమాండే. ఎందుచెతనంటే ఏపీ ప్రజలు ఒకసారి కాదు రెండు సార్లు మోసపోయారు. మరి మూడవసారి అయినా వారు ఇలాంటి పూచీకత్తు హామీ తీసుకోకపోతే మళ్ళీ మోసమే. కానీ అలా రాజకీయ పార్టీలు చేస్తాయా. సాధ్యమేనా


కోర్టుకు వెళ్ళేవాళ్లం :


‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటనను పరిశీలిస్తామని మాత్రమే విభజన చట్టంలో చెప్పారు. హోదా, విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు, దుగరాజపట్నం పోర్టు ఇలా పలు అంశాలను పరిశీలిస్తామని మాత్రమే విభజన చట్టంలో ఉంది. అలా కాకుండా... స్పష్టమైన హామీ ఇచ్చి ఉంటే కోర్టుకైనా వెళ్లి వాటిని సాధించుకునే వాళ్లం’’ అని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పేర్కొన్నారు మరి ఇది కూడా నిజమే. ఉత్తితీ హామీలు ఇచ్చి ఏకంగా కోట్లాది మంది ప్రజలను బురిడీ కొట్టించే పార్టీలు  చేసిన మోసం ఏంటన్నది పాలకొండ సభలో జగన్ ఎండగట్టారు. ఇకనైనా సవ్యమైన రీతిలో హామీ ఇస్తే కాంగ్రెస్ కైనా మద్దతు ఇస్తామని జగన్ చెప్పడం విశేషమే. మరి చూడాలి దీనికి కాంగ్రెస్, ఆ పార్టీ కొత్త మిత్రుడు చంద్రబాబు రిటార్ట్ ఎలా ఉంటుందో


మరింత సమాచారం తెలుసుకోండి: