కూకట్ పల్లి ప్రజలు తమ తమ వ్యాపకాల్లో బిజీగా ఉన్నా ప్రజా జీవితం మాత్రం చాలా ప్రశాంతం గా ఉంటుంది. అయితే ఈ ముందస్తు ఎన్నికలు ప్రచారంతో ఒక్కసారిగా ఏదో తెలియని విభిన్న వాతావరణం నెలకొంది. అన్నింటిని మించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణా ఎన్నికల్లో పరోక్ష ప్రవేశంతో కొంత తీవ్రమైన వాతావరణంతో పాటు ప్రశాంత వాతావరణంలో ఏదో తెలియని అశాంతి నెలకొంది. 
Image result for kukatpally constituency
అంతేకాదు ఆయన దొడ్దిదారిన తెలంగాణా రాజకీయాల్లోకి కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకొని తద్వారా ప్రవేశించబోతున్నారు. పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్ధిగా, తెలుగు దేశం తరపున కూకట్ పల్లిలో స్వర్గీయ నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని ఎంపికతో అక్కడ హరికృష్ణ కుటుంబంలో అనేక రాజకీయ సమస్యలు తలెత్తాయి. అంతే కాదు ఇక్కడ కూకట్ పల్లిలో మారిన రాజకీయ సమీకరణాలు కొంత అశాంతికి గురిచేసేలా ఉన్నాయి.
Related image
గత ఆదివారం కూకట్ పల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో వినిపించిన మాటల విశ్లేషణ ఇలా ఉంది. చంద్రబాబు రాజకీయం కవల పిల్లలు. ఆయనను రాజకీయా లను విడదీయలేము. ఎక్కడకు ఆయన వచ్చినా అక్కడ రాజకీయం తప్పదు. అది పుట్టిరోజైనా, మరణించిన చోటైనా. రాజకీయం ఆయన ప్రాణ  వాయువు.

అది లేకుండా ఆయన బ్రతక లేరు. నిన్న ఆయన హైదరాబాద్ ప్రపంచంలోనే తనకత్యంత ప్రియమైన ప్రాంతమని అనటంతోనే చాలామంది విఙ్జులు ఇక కుళ్ళు కుతంత్ర రాజకీయాలు హైదరాబాద్లో మొదలౌతాయని అంటున్నారు అందులో చంద్రబాబు సామాజిక వర్గం మిత్రులు కూడా ఉన్నారు.   
Image result for nandamuri suhasini Vs Madhavaram Krishnarao
తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గజ్వెల్, కొడంగల్, సిరిసిల్ల వంటి వాటితో పాటు కూకట్‌ పల్లి నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో పోటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని బరిలో ఉండటమే కారణం.  2014లో ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన మాధవరం కృష్ణారావు గెలిచారు. ఆ తర్వాత ఆయన తెరాసలో చేరారు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి ఆయన బరిలో నిలిచారు. మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీ కూకట్‌పల్లి స్థానాన్ని తీసుకుంది. 
Image result for nandamuri suhasini Vs Madhavaram Krishnarao
పోటీ విషయంలో తర్జన భర్జన అనంతరం నందమూరి కుటుంబ సభ్యురాలు సుహాసినిని ఎన్నికల బరిలోకి దింపింది తెలుగుదేశం. నాడు టీడీపీ నుంచి గెలిచిన మాధవరం తెరాస నుంచి పోటీ చేయడం, అతనిపై ఈమె బరిలోకి దిగడం దీంతో ఈ నియోజకవర్గంలో పోటీ అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ సమీకరణాలతో సుహాసినికి భారీ మెజార్టీ ఖాయమంటున్నారు కొందరు. అదీ ఆమె సామాజిక వర్గానికి చెందిన వారు.

Image result for nandamuri suhasini Vs Madhavaram Krishnarao

కూకట్‌పల్లి నియోకవర్గం సమీకరణాలను చూస్తే నందమూరి సుహాసిని గెలుపు ఖాయమని మహాకూటమి చెబుతోంది. 

*ఏపీ ఓటర్లు, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు ఉన్న బలం, 

*నందమూరి కుటుంబానికి ఉన్న ఆకర్షణ  

*గొట్టిముక్కల పద్మారావు తదితర నేతల చేరిక.  నూతన సమీకరణాలతో సుహాసిని భారీ మెజార్టీతో గెలుస్తుందని చెబుతున్నారు. 

*పలువురు కమ్మ సామాజిక వర్గ సినీ నటులు కూడా ఆమెకు మద్దతు పలికారు.

Image result for nandamuri suhasini Vs Madhavaram Krishnarao
ఈ సందర్భంగా ఒక విషయంలో మాత్రం ఆందోళన పూరిత వాతావరణం నెలకొంది. కమ్మ వారంతా వారి వారి వృత్తులేవైనా అంతా ఐఖ్యంగా ఒకటిగా మాట్లాడటం తో మిగిలిన వారిలో అంటే రెడ్డి, వెలం, కాపు వర్గాల్లో కూడా మనమెందుకు ఐఖ్యంగా ఉండకూడదు అన్న భావన పెల్లుభుకుతుంది. ఈ విషయం అనేక మంది విభిన్న వర్గాల మిత్రుల నుండి ఒకేలాగా వినిపిస్తుంది. అంటే కులాల కుంపట్లు గతంలో లేవని కాదు ఇప్పుడు మాత్రం ప్రభలమౌతున్నాయి. బహుశ కులాల అగ్ని కీలలు చెలరెగే వాతావరణమే ఉంది. 


తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్దాక ప్రవాసాంద్రులను విభిన్నంగా చూసిందేమీ లేదు. అలాంటి ఘటనలు ఎక్కడా మచ్చుకైనా కనపడలేదు. ఇప్పుడే ఆ అశాంతి ఆ అసహన రాజకీయ వాతావరణం చంద్రబాబు ప్రవేశంతో కూకట్‌పల్లి అంతా అలుముకుంటుంది.  అందుకే ఏపి నుంచి గతకాలంలో వచ్చి కూకట్ పల్లిలో స్థిరపడ్డ ప్రవాసాంద్రులలో స్పష్టమైన చీలిక కనిపిస్తుంది. కమ్మ,  కమ్మెతర వర్గాలుగా ప్రవాసాంద్రులు చీలిపోయారు. కమ్మ సమాజానికి చంద్రబాబు దైవసమానులు. అందుకే కమ్మేతరులు మరో నాయకుణ్ణి వెతుక్కుంటున్నారు. దృవీకరణ సుస్పష్టం.


ఇంత వరకు రంగంలో లేని వైసిపి ఇప్పుడు తెరపైకి వచ్చింది. కమ్మేతరులంతా వైసిపి వైపుకు ఆకర్షింపబడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.  ఇంతవరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వైసిపి, జనసేన దూరం పాటిస్తోంది. ఈ రెండు పార్టీలు ఏపీలో కీలకంగా ఉన్నాయి. ఇందులో జగన్మమోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీకి తెలంగాణలో కొంత బలం ఉంది. ఏపీ ఓటర్లు ఉండే కూకట్‌ పల్లి నియోజకవర్గం లోను ఆ పార్టీకి బలం ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌ పల్లి వైసీపీ, తెరాసకు మద్దతివ్వాలని నిర్ణయించింది.

Related image

 కూకట్‌పల్లిలోని:

*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు 

*ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు పార్టీ విభెధాలు మరచి పోయి తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు మద్దతి వ్వాలని నిర్ణయించారు.

*ఇక్కడ నందమూరి సుహాసినిని ఓడించాలని వైసీపీ భావిస్తోంది.
  
*తెరాస నుంచి పోటీ చేస్తున్న మాధవరం కృష్ణారావు వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. *తెదెపా సుహాసినిది కమ్మ సామాజిక వర్గం. 

ఇక్కడ వెలమ సామాజిక వర్గం 3వేలు నుండి 4 వేల మధ్య మాత్రమే ఉంది. 

కమ్మ సామాజిక వర్గం 13వేల నుండి 15 వేల మధ్య ఉంది. 

రెడ్డి సామాజిక వర్గం 22 వేలకు పైగా ఉంది. 

కాపు సామాజిక వర్గానికే కారణం 64 వేల నుండి 65 వేల మధ్య ఉంటారు. 

ముస్లీంల సంఖ్య తక్కువేమీ కాదువారు 61వేల నుండి 62వేల మధ్య ఉంటారు.

Image result for caste politics in kukatpalli constituency 2018
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గెలవాలని వైసిపి జగన్మొహన రెడ్డి తో సహా వైసీపీ మొత్తం కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ, తెజస, సీపీఐ నేతృత్వంలోని మహాకూటమి గెలిస్తే ఆ ప్రభావం 2019 సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కచ్చితంగా పడుతుంది. 


అప్పుడు ఏపీలోను కాంగ్రెస్, టీడీపీలకు ప్లస్ అవుతుంది. అదే తెరాస గెలిస్తే కాంగ్రెస్, టీడీపీ కూటమిని తెలంగాణ ప్రజలు తిరస్కరించినట్లు అవుతుంది. ఈ ప్రభావం ఏపీలోను పడి అది వైసీపీకి ప్లస్ అవుతుందని, 


అప్పుడు వైసీపీ గెలవడానికి మరింత సులువు అవుతుందని భావిస్తున్నారు. అందుకే జగన్, వైసీపీ నాయకులు మహాకూటమి ఓడిపోవాలని చూస్తున్నారు.
 Image result for TRS campaign in kukatpally 
*తెలంగాణలోని సీమాంధ్రులు, ముఖ్యంగా కూకట్‌ పల్లి వాసులు మహాకూటమికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. 

*అలాగే కేసీఆర్ పాలనలో ఎలాంటి ప్రాంతీయ విభేదాలు లేవని, సీమాంధ్రులను కూడా తెలంగాణ వారితో సమానంగా చూస్తున్నారని చెబుతున్నారు. కాబట్టి తెరాసకే ఓటు వేయాలని కోరుతుంది వైసిపి.
  
ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మహాకూటమి ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం అతను ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. 

*కూకట్‌పల్లి నియోజకవర్గంలో మెజార్టీగా ఉన్న కాపు సామాజిక వర్గం నేత జనసేనాని. ఇక్కడి కాపులలో పెద్దగా ఐక్యత లేదని అంటున్నారు. ఇక్కడి ఓట్లు చీలడం వల్లే టీడీపీకి గతంలో లాభించిందని చెబుతున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అంటున్నారు. ఆయితే పవన్ కళ్యాణ్ కు కెసిఆర్ తో ఉన్న స్నేహ సంభందాల దృష్ట్యా ఈ కాపు ఓట్లన్నీ టిఆరెస్ వైపే పడిపోతాయని – కమ్మ వారిలోని ఐఖ్యత తో తమ ఉనికికి భంగం కలగవచ్చన భయం కాపు వర్గాల్లో నెలకొంది. ఆంతకు మించి పూలలో దారంలా పవన్ కళ్యాన్ సహకారతో అంతా ఒక్కటయ్యారని తెలుస్తుంది.  
Image result for TRS campaign in kukatpally
*ముఖ్యంగా తెలంగాణ విషయానికి వచ్చేసరికి టీడీపీని ఏపీ పార్టీగా చూస్తూ ఓటు వేస్తున్నారట. అందుకే ఇక్కడ భూమిపురులైన తెలంగాణా వాసులంతా తెరాసకే వోటు వేస్తూన్నారని తెలుస్తుంది కారణం టిడిపి ఆంధ్ర పార్టీ అని నమ్మటమే.  
  
*అలాగే, ఓటింగ్ విషయంలో తెలంగాణ ముస్లీంలకు భిన్నంగా ఏపీ ముస్లీంలు ఆలోచిస్తారని చెబుతున్నారు. వీరు కూడా కూకట్‌ పల్లిలో ఎక్కువగా ఉన్నారు. ప్రతి ప్రాంతంలో వీరి ఓట్లు గంప గుత్తగా ఒక వైపే పడతాయి. కానీ కూకట్‌పల్లిలో మాత్రం అందుకు భిన్నమని చెబుతున్నారు. వీరి ఓట్లు కూడా టీఆర్ఎస్, టీడీపీలకు చీలుపోతాయంటున్నారు. 

*అయితే కేసీఆర్ పాలన కారణంగా వీరు తెరాస వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారని భావిస్తున్నారు. మొత్తానికి సుహాసినిని ఓడించాలన్న వైసీపీ నిర్ణయం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. 

Image result for caste politics in kukatpalli constituency 2018

ఇప్పుడు కూకట్ పల్లి లోనే కాదు ఆంధ్రప్రదేశ్ వలసవారున్న ప్రతి చోట కమ్మ కమ్మేతర చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు ఏపిలోనే కాదు ఇటు తెలంగాణలో కమ్మవారు వేరేవారి అవకాశాలను లాగేసు కుంటున్నరన్న ప్రచారం బాగాఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ఈ ప్రభావం ముఖ్యంగా తెలంగాణాపై పడగా ఇతర రాష్ట్రా లకు కూడా వ్యాపిస్తుంది.

Image result for kukatpally bjp candidate 2018

అదే సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తూ వస్తుంది. ఈ ప్రభావం ఈ ఎన్నికల్లో టిడిపి ప్రత్యక్షంగా ప్రవేసించలేక కాంగ్రెస్ ను ముందు పెట్టుకొని తాను నేపధ్యంలో దొడ్డిదారిన తెలంగాణాలో ప్రవేసించటం అదీ నందమూరి కుటుంబాన్ని అడ్డుపెట్టుకొని రావటంతో వారికి కూడా ఈ అపప్రద అంటు కుంటుంది. బాబు గారి ఈ ప్రవర్తన కమ్మ వారిని సమాజం నుండి వేరు చేస్తుందా? అనే అనుమాన బీజాలు కూకట్ పల్లిలో అంకురించగా - ఈ కారణంగా కూకట్ పల్లిలో  ఈ పరిస్థితులన్నీ క్రమంగా టీఆరెస్ కు అనుకూలంగా మారుతున్నాయని తెలుస్తుంది. 

Image result for kukatpally bjp candidate 2018

ఇక్కడి టిడిపి కులజాఢ్యం టీఆరెస్ నియంతృత్వం నచ్చనివారు మంచివాడు అని పేరున్న బిజెపి అభ్యర్ధి ఎం. కాంతారావుకు ఓటెసే అవకాశాలు మెండు గా కనిపిస్తున్నాయి. వైసిపి జనసేనలు మాత్రం తెలుగుదేశానికి వ్యతిరేఖంగా చెసే ప్రచారం మాత్రం తీవ్ర రూపం దాలుస్తుంది. టిడిపి కి ఓటు వెయ్యొద్దు. టీఅరెస్ కు వెయ్యండి. టీఅరెస్ వెయ్యటం ఇష్టం లేని వాళ్లు బిజెపికి ఓటేస్తే చాలు. ఎలాంటి పరిస్థితుల్లో టిడిపికి వెయ్యవద్దని నిష్కర్షగా చెపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: