ఒకవైపు తెరాస నుంచి వలసవస్తున్న నేతలను చేర్చుకుంటోంది కాంగ్రెస్ పార్టీ.  తెరాస పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ లోకి చేరిపోయాడు. అలాగే ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కూడా. ఈ జాబితాలో మరెంతో మంది  ఉన్నారని కాంగ్రెస్ అంటోంది. ఎన్నికలకు ముందు ఇలాంటి పరిణామాలు తెరాసకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తూ ఉన్నాయి. తాము ముందస్తు ఎన్నికలు తెస్తే, తమ పార్టీ నుంచి నేతలు వీడటం ఏ పార్టీకి అయినా అసహనమే. దానికి తెరాస మినహాయింపు కాదు.

 Image result for azharuddin joins TRS

ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పై కౌంటర్ అటాక్ కు సిద్ధం అవుతోందట తెలంగాణ రాష్ట్ర సమితి. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ లోని నేతలకు తెరాస వలవేస్తోందని సమాచారం. ఇందులో మాజీ క్రికెటర్ అజరుద్ధీన్ పడ్డాడు అని సమాచారం. అజరుద్ధీన్ ను తమ పార్టీ లోకి చేర్చుకోవాలని తెరాస అనుకుంటోందట. దానికి ఆ మాజీ క్రికెటర్ కూడా అంగీకరించినట్లు ప్రచారంలో ఉంది.  

 Image result for azharuddin joins TRS

అజరుద్ధీన్ కాంగ్రెస్ కు ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేస్తున్నాడు. అయితే వచ్చే ఎన్నికల్లో  అజరుద్ధీన్ కు కాంగ్రెస్ లో ప్రాధాన్యత దక్కేలా లేదు. తను సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని  అజరుద్ధీన్ అనుకుంటున్నాడు. అయితే కాంగ్రెస్ లో ఆ అవకాశం దక్కేలా లేదు. సికింద్రాబాద్ నుంచి ఆ పార్టీకి అంజన్ కుమార్ యాదవ్ అభ్యర్థిగా ఉన్నాడు.

 Image result for azharuddin joins TRS

ఈ నేపథ్యంలో ఈ పార్టీలో ఎలాగూ ఛాన్స్ దక్కదని గ్రహించిన  అజరుద్ధీన్ తెరాసలో కర్చిఫ్ వేస్తున్నాడట. సికింద్రాబాద్ నుంచి పోటీకి అవకాశం ఇస్తే జాయిన్ అవుతానని అంటున్నాడట. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన కాంగ్రెస్ హై కమాండ్ అజర్ ను బుజ్జగిస్తోందని సమాచారం. కీలకమైన పదవి ఇస్తాము.. కాంగ్రెస్ లోనే ఉండు అని అజరుద్ధీన్ ను బతిమాలుతున్నారని సమాచారం.

Image result for azharuddin joins TRS

నల్గొండలో ఇద్దరు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు టీఆర్‌ఎస్‌ లో చేరడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత, న్యాయవాది ధరణికోట రాముతో పాటూ మూడు సార్లు కౌన్సిలర్‌గా గెలుపొందిన చిలుకల గోవర్ధన్‌ లు కాంగ్రెస్‌ పార్టీకి వీడ్కోలు పలికారు. 

Image result for trs flag images

గురువారం ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో చిలుకల గోవర్ధన్‌ తో పాటూ ధరణికోట రాము టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఆపద్ధర్మ మంత్రి జగదీష్‌ రెడ్డి మంతనాలతో ఈ ఇద్దరు నేతలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది.



విద్యార్థి ఉద్యమాల నుండి ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌ లలో ధరనికోట రాము క్రియాశీలక పాత్ర పోషించారు. దివంగత చకిలం శ్రీనివాసరావు అనుచరుడి గా కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. నల్గొండ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి గా కూడా విధులు నిర్వహించారు. హైదరాబాద్‌ లోని సంజయ్ గాంధీ పాలిటెక్నీక్ కళాశాల అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించడంతో పాటూ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి  ప్రధాన అనుచరుడిగా పార్టీలో ధరణికోట రాము కు గుర్తింపు ఉంది.

Congress senior leaders joins in Trs - Sakshi

మరింత సమాచారం తెలుసుకోండి: