కొన్ని వార్త‌లు న‌మ్మ‌శ‌క్యంగా ఉండవు. అలాంటి వార్త‌ల్లో ఇప్పుడు సోష‌ల్ సైట్ల‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న వార్త‌ల్లో కీల‌క‌మైందిగా తెర‌మీదికి వ‌చ్చింది ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌.. వైసీపీలోకి చేరుతున్నార‌నే వార్త‌. నిజానికి ఆమంచి ఎవ‌రికీ లొంగ‌ని నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు. గురువు కొనిజేటి రోశ‌య్యే అయినా.. ఆయ‌న‌ను మించిన నాయ‌కుడిగా ఎదిగాడు. పార్టీల‌తో సంబంధం లేకుండా తాను సొంతంగా ఎదిగి.. త‌న‌కంటూ కేడ‌ర్ సంపాయించుకున్నా రు. 2014లో సొంత‌గానే పోటీ చేసి చీరాల నుంచి విజ‌యం సాధించాడు. అయితే, ఇప్పుడు ఈ ఎమ్మెల్యే వైసీపీలో చేర‌నున్నార‌నే వార్తలు సోష‌ల్ మీడియాలో జోరుగా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 


2014 ఎన్నిక‌ల్లో చీరాల‌లో వైసీపీ మూడ‌వ స్థానంలో నిలిచింది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున పోటీ చేసిన బాలాజీనే ప్ర‌స్తుతం చీరాల ఇంచార్జ్‌గా ఉన్నారు. అయితే నాడు చీరాల‌లో ఆమంచి కృష్ణ‌మోహ‌న్ స్వ‌తంత్ర అభ్యర్ధిగా బ‌రిలోకి దిగి విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత ఆయ‌న టీడీపీలో చేరారు. అయితే ప్ర‌స్తుతం ఆమంచిని టీడీపీ పూర్తిగా విమ‌ర్శించింద నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల ప్ర‌కాశం జిల్లాలో టీడీపీ  నాయ‌కులు మొత్తంగా వ‌న భోజ‌నాలు ఏర్పాటు చేసుకున్నా.. ఆమంచికి మాత్రం ఆహ్వానం ద‌క్క‌లేదు.  దీంతో ఆయ‌న ఆ కార్య‌క్ర‌మానికి దూరంగానే ఉన్నారు. ఇక‌, దీంతో ఆమంచి వ‌ర్గాన్ని టీడీపీ దూరం పెట్టార‌నే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక‌, మ‌రోవైపు వైసీపీ ఎప్ప‌టి నుంచో ఆమంచి పై క‌న్నేసింది. 

Image result for ఆమంచి కృష్ణ‌మోహ‌న్

ఈ క్ర‌మంలో వైసీపీ ముఖ్య‌నేత‌లు ఆమంచికి మంచి ఆఫ‌ర్ కూడా ఇచ్చార‌ని స‌మాచారం. దీంతో టీడీపీలో ఉన్నా పెద్ద‌గా ఉప‌యోగం లేదు, అదే వైసీపీలోకి వెళితే స‌ముచిత స్థానం ద‌క్కుతుంద‌ని, త‌న సన్నిహితుల‌తో చ‌ర్చించార‌ట‌. దీంతో ఆమంచి జ‌గ‌న్ ప్రారంబించ‌నున్న బ‌స్సు య‌త్ర లోపే వైసీపీలో చేర‌డం ఖాయ‌మ‌ని ఆమంచి స‌న్నిహితుల ద‌గ్గ‌రి నుండి ఈ విష‌యం లీక్ అయ్యింద‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం అవుతోంది. దీంతో నిజంగానే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వైసీపీలో చేరితే టీడీపీకి పెద్ద షాకే అని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. కానీ, ఆమంచి మాత్రం అంత ఈజీగా జ‌గ‌న్‌కు చిక్కుతారా? అనేది మ‌రో వ‌ర్గం మాట‌. 


జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలి మాదిరిగానే ఆమంచి కూడా ఉంటారు. ఆయ‌నకు త‌న సొంత స‌ల‌హాలే న‌చ్చుతాయి త‌ప్పితే..ఎవ‌రివీ న‌చ్చ‌వు. దీంతో ఇప్పుడు ఇలా వైసీపీలోకి వెళ్తారా? అనేది మ‌రో ముచ్చ‌ట. ఇటీవ‌ల చంద్ర‌బాబు ఆమంచితో మాట్లాడార‌ని, పార్టీలో ఏం కోరుకున్నా చేస్తాన‌ని హామీ ఇచ్చార‌నే ప్ర‌చారం ఒక‌టి జోరుగా సాగుతోంది. మ‌రి ఆమంచి పార్టీ మార‌తాడ‌నే వార్త‌ల్లో నిజం ఎంత ఉందో తేలాలంటే వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు. 



మరింత సమాచారం తెలుసుకోండి: