ప్రపంచం టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు సాధించింది.  ముఖ్యంగా శాటిలైట్ రంగంలో ఎన్నో ప్రయోగాలు చేస్తూవస్తుంది.  భారత దేశంలో కూడా ఇప్పటి వరకు ఎన్నో అంతరిక్ష పరిశోధనలు చేస్తు విజయాలు తన ఖాతాలో వేసుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో చారిత్రక ప్రయోగానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 9.58 గంటలకు ఏకకాలంలో 31 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ-43 వాహకనౌక ద్వారా పంపేందుకు ఏర్పాట్లు పూర్తిచేసిన విషయం తెలిసిందే.
Image result for pslv c43
తాజాగా ఈ ఉదయం 9.57కు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ - సీ43 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.  అమెరికాకు చెందిన 23 చిన్న ఉపగ్రహాలతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, ఫిన్ ల్యాండ్, కొలంబియా, మలేసియా, నెదర్లాండ్స్, స్పెయిన్ దేశాలకు చెందిన  31 ఉపగ్రహాలను ఈ వాహకనౌక కక్ష్యలోకి చేర్చనుంది.
Image result for pslv c43
భూ ఉపరితల పరిస్థితులను అధ్యయనం చేసేలా, ఐదేళ్ల పాటు పని చేసే 380 కిలోల శాటిలైట్ 'హైసిస్'ను ఇది కక్ష్యలోకి చేరుస్తుంది. పీఎస్ఎల్సీ సిరీస్ లో ఇది 45వ ప్రయోగం. నింగిలోకి తన ప్రయాణాన్ని ప్రారంభించిన పీఎస్ఎల్వీ - సీ 43 వాహక నౌక, ఆపై 18 నిమిషాల తరువాత నిర్ణీత కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టనుంది. గతంలో ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి ఇస్రో ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: