ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫ్రాన్స్‌లోని ఎత్తైన కట్టడం ఈఫిల్‌ టవర్‌కు చెందిన కొన్ని మెట్లను వేలానికి పెట్టగా వాటికి భారీ ధర పలికింది. 1983లో ఈఫిల్ టవర్‌లోని కొన్ని మెట్లను లిఫ్ట్ ఏర్పాటు చేసే క్రమంలో తొలగించారు. 2 నుంచి 9 మీటర్ల ఎత్తుతో 24 భాగాలను కట్‌ చేసి తీశారు. అప్పట్లో వాటిని పలు మ్యూజియంలలో ఉంచేందుకు తీసుకెళ్లారు. కొన్నింటిని ప్రపంచంలో పలు చారిత్రక ప్రాంతాల్లో అమర్చారు. అనంతరం 2016లో ఆర్ట్‌కరియల్ అనే సంస్థ తొలగించిన 14 మెట్లను వేలం వేయగా 5,23,800 యూరోలకు అమ్ముడుపోయాయి.


తాజాగా  ప్రీసేల్‌ అంచనాల కంటే మూడు రెట్లు ఎక్కువగా 1,69,000 యూరోలు పలికినట్లు వేలం నిర్వహకులు ప్రకటించారు. ఈఫిల్‌ టవర్‌లోని రెండు, మూడు అంతస్తుల మధ్య గతంలో తొలగించిన దాదాపు రెండు డజన్ల ఇనుప మెట్లను ఆర్ట్‌కరియల్‌ అనే సంస్థ వేలం వేయగా.. మధ్యప్రాచ్యానికి చెందిన కొనుగోలుదారు 1,69,000యూరోలు (1,90,000డాలర్లు, సుమారు రూ.1.34కోట్లు) చెల్లించి కొనుగోలు చేశారు.  

Stairs From Eiffel Tower Sell At Auction For 1,69,000 Euros

ఈఫిల్ టవర్‌లోని రెండు, మూడు అంతస్తుల మధ్య గతంలో తొలగించిన దాదాపు 25 ఇనుప మెట్లను ఆర్ట్‌కరియల్ సంస్థ వేలం వేసింది. ఈ వేలంలో మెట్లు 40 నుంచి 60 వేల యూరోలు పలుకుతాయని భావించిన సంస్థకు షాక్ కలిగేలా మూడు రెట్ల ఎక్కువ ధరకు అమ్ముడుపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చారిత్రక కట్టడమైన 324 మీటర్ల ఎత్తైన ఈఫిల్‌ టవర్‌ను 1889లో నిర్మించారు. 41ఏళ్ల పాటు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: