తెలంగాణ ఎన్నికలనగానే ఇక్కడ నివసిస్తున్న సీమాంద్రుల ఓట్లు ఎటు వైపు పడతాయన్నదానిపై సహజంగానే ఆసక్తి ఏర్పడుతుంది.తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపద్యంలో మంత్రి కెటిఆర్ వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ లో లక్షల సంఖ్యలో సీమాంధ్రలు నివసిస్తున్నారు. గత ఎన్నికలలో వీరిలో మెజార్టీ బిజెపి,టిడిపి కూటమి వైపు మొగ్గు చూపిన మాట నిజమే. దానికి ఉదాహరణగా టిడిపి పది సీట్లు, బిజెపి ఐదు సీట్లు హైదరాబాద్ పరిసరాలలోనే గెలుచుకున్నాయి.

 

అప్పట్లో ప్రదాని నరేంద్ర మోడీ ప్రభంజనం బాగా వీచింది. అలాగే పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా ఇక్కడ ఉంది. అలాగే ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసిపి నేత జగన్మోహన రెడ్డి పై ఉన్న అభిమానం కూడా ఇక్కడ బాగా పని చేసింది. అందువల్లే ఖమ్మం జిల్లాలో ఒక పార్లమెంట్  స్థానం, మూడు శాసనసభ స్థానాలు  గెలుచు కుంది.వైసిపి కాని, జనసేన కాని ఈసారి ఇక్కడ పోటీ చేయడం లేదు. దాంతో గత సారి వైసిపి ఓటు వేసిన వారు ఇప్పుడు ఎవరికి వారి ఓటు వేస్తారు?

Image result for seemandhra settlers in Hyderabad

అలాగే జనసేన కారణంగా బిజెపి,టిడిపి కూటమి కూటమికి ఓటు వేసిన వారు ఇప్పుడు ఎవరికి వారి ఓటు వేస్తారు?  అన్నది కొంత ఉత్కంఠ కలిగించే అంశమే. నాటి శాసనసభ  ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలలో హైదరాబాద్ మునిచిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వారు, వీరు అని బేధం లేకుండా అంతా టిఆర్ఎస్ కే ఓటు వేశారు. దాంతో అత్యధిక స్థాయిలో టిఆర్ఎస్ 99 స్థానాలు గెలుచుకుంది. అది జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళా శాసనసభ ఎన్నికలు వచ్చాయి. జిహెచెంసి ఎన్నికలలో టిఆర్ఎస్ కు ఓటు వేసినవారు ఈసారి ఎందుకు వేయరన్న అనుమానం వస్తుంది.


అయితే ఇది ఒకరకంగా ప్రభుత్వాన్ని కొననసాగించడానికో, మార్చడానికో జరిగే ఎన్నికలు కావడంతో అప్పటి మాదిరిగా అందరూ ఆలోచించకపోవచ్చు.అలాగని ఆలోచించరని కూడా ఏమీ లేదు.  సీమాంద్ర రాజకీయాల ప్రబావం కూడా ఇక్కడ పడేలా కనిపిస్తోంది. ఆంద్ర ప్రదేశ్ లో టిడిపిని, చంద్రబాబును వ్యతిరేకించే వారంతా కాంగ్రెస్ కూటమికి ఓటు వేయడానికి ఇష్టపడకపోవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి.వైసిపి ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి దీని గురించి మాట్లాడుతూ జగన్మోహన రెడ్డి పై అంత దారుణంగా చంద్ర బాబు హత్యాయత్నం చేయించిన తర్వాత, ఇరవై మూడు మంది వైసిపి శాసన సభ్యులను నిర్దయగా  చంద్రబాబు ప్రలోభానికి నయానో భయానో కొనుగోలు చేసింది.

Related image

వైఎస్ రాజశేఖరరెడ్డి నాడు కాంగ్రెస్ ను ఒంటి చేత్తో నిలబడితే, కాంగ్రెస్ పార్టీ, సోనియగాంధీ మానవత్వం లేకుండా వారి కుటుంబాన్నిఇక్కట్ల పాలు చేశాక,  అన్నిటికి మించి టిడిపితో కలిసిన తర్వాత ఆ కూటమికి వైఎస్ అభిమానులు ఎవరూ ఓటు వేయజాలరని అబిప్రాయ పడ్డారు. అందులోను ఒక సామాజికవర్గానికి ఇతర సామాజిక వర్గాలు దూరం గా ఉంటున్నాయని దాని ప్రభావం కూడా ఉంటుందన్నవిశ్లేషణలు వస్తున్నాయి.ఇక హైదరాబాద్ లో సీమాంద్రుల కుఈ నాలుగున్నర సంవత్సరాలలో పెద్ద ఇబ్బంది ఏదీ రాలేదని చెప్పారు. అలాగే శాంతి భద్రతల సమస్య అదుపులోనే ఉంది.

Related image

పేకాట క్లబ్ లు వంటి వాటిని కెసిఆర్ మూయించివేయించటం ఒక మంచి పరిణామం హైదరాబాద్ లో కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో వంతెనలు, రోడ్ల నిర్మాణం వంటివి చేస్తున్నారు. అలాగే ఐటి రంగం అబివృద్దికి కెటిఆర్ చొరవ తీసుకున్న తీరు అందరిని ఆకట్టుకుంటోంది. ఆయన కూడా సీమాంద్రులతో ప్రత్యేకంగా సమావేశం అయి వారి కి భరోసా ఇచ్చారు.  అందువల్ల తెలుగుదేశం పార్టీని గాని చంద్రబాబును చూసి ఆ పార్టీ అభిమానులు కొంత శాతం తప్ప,మిగిలినవారు యథాప్రకారం ఓటు వేస్తారు తప్ప, సీమాంద్ర నుంచి ఇక్కడ స్థిరపడ్డాం కనుక ఫలానా పార్టీకే ఓటు వేయాలని ఏమీ లేదని భావిస్తున్నారు.

Image result for seemandhra settlers in Hyderabad

టిడిపి అదినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని రంగంలో దించి, ఆమెను అటు నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తిగా, ఇటు సీమాందృలకు ప్రతినిదిగా చూపాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. దీనివల్ల ఇంతకాలంగా ఆంద్ర, తెలంగాణ వివాదాలు లేకుండా సాగుతున్న ప్రజా జీవితంలో కొత్త పంచాయతీకి ఆస్కారం కలిగిస్తుందన్నఅనుమానం కూడా లేకపోలేదు. డీని ద్వారా సీమాంద్రకు చెందిన తెలుగుదేశం పార్టీతో చెలిమి వారికే చేటని భావిస్తున్నారు ఇక్కడ స్థిరపడ్డ సీమాంధృలు. ఇక జనసేన  అదినేత పవన్ కళ్యాణ్ కూడా తాను ఇక్కడ ఈ సారి పోటీ చేయబోవడం లేదని ప్రకటించారు. దాంతో ఆయన అబిమానులు కూడా వారికి నచ్చిన పార్టీకి ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది. అయితే జగన్మోహన రెడ్డి ఎటూ టిడిపికి పూర్తి ప్రత్యర్ధి. పవన్ కళ్యాణ్ తాజాగా చంద్ర బాబు నాయుడికి వ్యతిరేఖి అయ్యారు.

Image result for jagan pavan

అంతేకాక, చంద్రబాబు ప్రభుత్వం అవినీతి మయం అయిందని ఘాటైన విమర్శలు కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు.అలాగే కాంగ్రెస్ తో కలిసి చంద్రబాబు టిడిపిని రాహుల్ గాందీ కాళ్ల వద్ద పడేశారని, ఆంద్రుల ఆత్మగౌరవాన్నిపునాదులు గా చేసుకొని నిర్మించబడ్డ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు సమూలంగా దెబ్బతీశాడని విమర్శిస్తున్నారు. అందువల్ల జనసేన పార్టీ వారు కాంగ్రెస్, టిడిపి కూటమికి కాకుండా మిగిలిన పార్టీల అభ్యర్ధులలో ఎవరో ఒకరికి ఓటు వేసుకోవచ్చు.అందువల్ల గత ఎన్నికల ప్రాతిపదికన టిడిపి ఓట్లు ఆశిస్తే అది అత్యాశే అవుతుందన్న అబిప్రాయం కలుగుతుంది.

Image result for seemandhra settlers in Hyderabad

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావం గట్టిగా పనిచేస్తే వైసిపి, జనసేన అబిమానులు టిడిపి, కాంగ్రెస్ కూటమికి కాకుండా,  మరే పార్టీకే ఓట్లు వేసే అవకాశం కనిపిస్తోంది దీనివల్ల సీమాంద్ర ఓటర్లు తెలంగాణ జనజీవనంలో కలిసి పోతున్న తరుణంలో ఇక్కడి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటారు తప్ప, చంద్రబాబు తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నారు కనుక, కాంగ్రెస్ తో కలిశారు కనుక వారికి ఓటు వేస్తారని అనుకోలేము. ఖాంగ్రెస్ టిడిపితో కూటమి కట్టకపోతే అప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది. కాని కాంగ్రెస్ ఆ స్వయంగా సదవకాశాన్ని వదలుకుంది.


అయితే గత ఎన్నికలలో కాంగ్రెస్ కు పడ్డ ఓట్లన్ని ఇప్పుడు టిడిపి-కాంగ్రెస్ నాయకత్వం వహిన్వ్చే ప్రజాకూటమికి, అలాగే టిడిపికి పడిన ఓట్లన్నిఈసారి కూడా ఇదే కూటమికి పడతాయన్న ఆశ లేదు. కాని ఇప్పుడు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ పాదాలకడ తాకట్టు పెట్టి వ్రతం చెడ్డా ఫలితం దక్కుతుందా?  అన్నదే ప్రధాన ప్రశ్న.


కొందరు అనేది ఏమంటే ప్రభావం చూపే సంఖ్యలో ప్రతిపక్షాల ఓట్లు ప్రతి నియోజక వర్గంలో చీలి బిజెపికి పడే అవకాశాన్ని విస్మరించలేమని అంటున్నారు. 

Image result for seemandhra settlers in Hyderabad

మరింత సమాచారం తెలుసుకోండి: