ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం రేపిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ త్వరలోనే ఎంటర్ కానుంది. విజయవాడలో అప్పట్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసులో విచారణ సమగ్రంగా జరగలేదని ఆమె తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.  ఏపీ పోలీసులు ఈ కేసు విచారణలో ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి సాధించనందున దీన్ని సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ విచారణను త్వరితగతిన ముగించి నివేదికను సమర్పించాలని సీబీఐ న్యాయవాదిని ఆదేశించింది. 

AP High Court hands over Ayesha Meera murder case to CBI

అయితే, ఆంధ్రప్రదేశ్ లోకి సీబీఐ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసకోవాలంటూ ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం సంచలన జీఓ జారీ చేసింది. ఇక కేసు విషయానికి వస్తే.. 2007 డిసెంబర్‌ 27న బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా విజయవాడలోని ఓ హాస్టల్‌లో హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది.  హాస్టల్ లోని బాత్రూమ్ లో రక్తపు మడుగులో పడి ఉన్న ఆయేషాను గుర్తించిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే తన ప్రేమను నిరాకరించినందుకు అయోషాను హత్య చేసినట్లు పోలీసులకు లేఖ లభించింది.  దాంతో అనుమానితుడిగా ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అనాసాగరం గ్రామానికి చెందిన సత్యం బాబుని పోలీసులు ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేశారు. 


నిజమైన నేరస్థులను రక్షించే ఉద్దేశంతోనే సత్యం బాబును అరెస్ట్ చేశారంటూ అతడి బంధువులు, మానవహక్కుల కార్యకర్తలు ఆరోపించారు. మొత్తానికి కొన్ని సంవత్సరాలు శిక్ష అనుభవించిన సత్యం బాబు నిర్దోషి అంటూ..ఉమ్మడి హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా విడుదల చేస్తూ గతేడాది ఏప్రిల్ లో తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు దోషుల్ని పట్టుకునేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. మరి, కోర్టు ఉత్తర్వులపై సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: