సుమన్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి తన అభిప్రాయాలను మీడియా తో పంచుకున్నాడు. అయితే చంద్ర బాబు మీద మాత్రం అందరి కంటే భిన్నంగా స్పదించాడు . అందరూ బాబు  2019 లో గెలవడం కష్టమే, ఈ నాలుగేళ్లలో ఏం చేశాడని అంటుంటే సుమన్ మాత్రం మళ్ళీ బాబు రావాలంటున్నాడు . ఇంతకీ సుమన్ ఏమన్నాడంటే ,  తెలంగాణలో పరిపాలన చాలా బావుందనీ, ఇంకోసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవ్వాల్సిందేననీ, సినీ పరిశ్రమకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చాలా చేసిందనీ సుమన్‌ చెప్పుకొచ్చాడు.

Image result for suman hero

అయితే సినీ పరిశ్రమ నుంచి టీఆర్‌ఎస్‌కి ఆశించిన స్థాయిలో పొలిటికల్‌ మద్దతు రాకపోవడానికి కుల సమీకరణాలతోపాటు చాలా కారణాలు వుండి వుండొచ్చని అభిప్రాయపడ్డాడు ఈ సినీనటుడు. మరి, ఆంధ్రప్రదేశ్‌ మాటేమిటి.? అనడిగితే, 'స్కూల్‌కి హెడ్‌ మాస్టర్‌గా అనుభవం వున్న వ్యక్తినే ఎంచుకుంటాం కదా.. ఆ లెక్కన, జగన్‌, పవన్‌ కంటే చంద్రబాబే అనుభవజ్ణుడు. అక్కడ రాజకీయ పరిస్థితులు వేరు.

Image result for suman hero

కొత్త రాష్ట్రంలో రాజధాని నిర్మాణం సహా, అనేక బాధ్యతలున్నాయి. వాటిని చంద్రబాబు మాత్రమే సమర్థవంతంగా నిర్వహించగలరు..' అని సెలవిచ్చాడు సుమన్‌. జగన్‌, పవన్‌ పట్ల తనకు వ్యతిరేకత లేదనీ, వారు ప్రజల్లో మమేకమవుతున్న తీరు ముచ్చటేస్తోందనీ సుమన్‌ 'బ్యాలన్స్‌' చేసేశాడనుకోండి.. అది వేరే సంగతి. జాతీయ రాజకీయాల విషయానికొస్తే, మళ్ళీ నరేంద్ర మోడీనే ప్రధాని అవ్వాలన్నది సుమన్‌ ఆకాంక్ష.

మరింత సమాచారం తెలుసుకోండి: