తెలంగాణా మంత్రి కెటియార్ తాజా మాటలు వింటుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. నందమూరి కుటుంబంపై చంద్రబాబునాయుడుకు నిజంగానే ప్రేముంటే ఓడిపోయే కుకట్ పల్లి నియోజకవర్గంలో నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి టిక్కెట్టు ఇచ్చేవారే కారని మాటలతో అందరిలోను అనుమానాలు మొదలయ్యాయి. లోకేష్ బాబును నేరుగా మంత్రిని చేసిన చంద్రబాబు సుహాసినిని మాత్రం తెలంగాణా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయిస్తున్నారని ప్రశ్నించారు. మరి ఈ ప్రశ్నకు చంద్రబాబు ఏమని సమాధానం చెబుతారో చూడాలి. సుహాసినికి రాజకీయాలు ఏమి తెలుసని పోటీలోకి దింపారంటూ గట్టి పాయింటే లేవనెత్తారు.

 

చంద్రబాబు రాజకీయానికి సుహాసిని బలిపశువైపోయిందంటూ కెటియార్ జాలి చూపించారు. సుహాసినితో పాటు ఆమె సోదరులను కూడా రాజకీయాలకు దూరం చేసేందుకు చంద్రబాబు కుట్ర చేశారంటూ మండిపడ్డారు. ఇపుడు కెటియార్ లేవనెత్తారని కాదుకానీ ఇవే ప్రశ్నలు తెలుగుదేశంపార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతోంది. నిజంగానే నందమూరి హరికృష్ణ కుటుంబంపై అంత ప్రేమే గనుక ఉండుంటే ఇదే సుహాసినిని వచ్చే ఎన్నికల్లో ఏపి నుండే పోటీ చేయించేవారు.

 

ఎలాగూ హరికృష్ణ గతంలో అనంతపురం జిల్లాలోని హిందుపురంలో ఎంఎల్ఏగా పనిచేశారు. ఇపుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో బాలయ్యకు మళ్ళీ టిక్కెట్టిచ్చే ఉద్దేశ్యంలో చంద్రబాబు లేరని స్పష్టమవుతోంది. మరి ఇటువంటి పరిస్దితుల్లో హరికృష్ణ కూతురు సుహాసినిని తెలంగాణాలోని కుకట్ పల్లి నుండి కాకుండా ఏపిలో హిందుపురం నియోజకవర్గం నుండే పోటీ చేయించవచ్చు. అపుడు గెలుపు కూడా తేలికయ్యుండేది. ఇఫుడు కుకట్ పల్లి లో సుహాసిని గెలుపు చివరి నిముషం  వరకూ గ్యారెంటీ లేదు. ఒకవేళ సుహాసిని గెలిస్తే తానే గెలిపించానని చెప్పుకుంటారు చంద్రబాబు. అదే ఓడిపోతే తాను అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోలేపోయారని కూడా అనగల ఘనుడు చంద్రబాబు.  ఈ విషయాలన్నీ ఏపిలో కూడా చర్చల్లో ఉన్నదే. అందుకే కెటియార్ కూడా చంద్రబాబుపై మండిపడ్డారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: