భారత దేశంలో అతి పెద్ద కుంభకోణాల్లో ఒకటైన  బొగ్గు కుంభకోణంపై ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ బొగ్గు కుంభకోణం యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అప్పటి బొగ్గు శాఖ కార్యదర్శి హెచ్ సీ గుప్తాతో పాటు మరో ఐదుగురిని దోషులుగా నిర్ధారించింది. వీరంతా అవినీతి నిరోధక చట్టం ప్రకారం అవినీతి, నేరపూరిత కుట్రలకు పాల్పడ్డారని నిర్థారించింది. గుప్తాతో పాటు వికాస్ పవర్ లిమిటెడ్ సంస్థపై నేరపూరిత కుట్రతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు రుజువు అయ్యాయని వ్యాఖ్యానించింది.
Image result for బొగ్గు కుంభకోణం
ఈ కేసుకు సంబంధించి శిక్షలను డిసెంబర్ 3న ఖరారు చేస్తామని కోర్టు పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లోని మొయిరా, మధుజోర్ (ఉత్తర, దక్షిణ) బొగ్గు క్షేత్రాల కేటాయింపులు 2012లో జరిగాయి.  దాదాపు 200 బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో అవినీతి జరిగినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ఆరోపించింది. రూ.1.86 లక్షల కోట్లు ఖజానాకు నష్టం జరిగినట్లు పేర్కొంది. 
Related image
దీని కాంట్రాక్టును వికాస్ మెటల్ పవర్ లిమిటెడ్‌కు అప్పగించారు. హెచ్ సీ గుప్తాతో పాటు ఈ కంపెనీ కూడా దోషేనని కోర్టు తీర్పు చెప్పింది.  కాగా, పశ్చిమబెంగాల్ లోని 40 గనులను వేర్వేరు సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని కోర్టు అభిప్రాయపడింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: