తెలుగుదేశంపార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. ఈరోజు సాయంత్రం పార్టీ సభ్యత్వంతో పాటు ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీకి, స్పీకర్ కార్యాలయానికి పంపారు. రావెల రాజీనామా విషయం బయటకు పొక్కటంతో పార్టీలో సంచలనం మొదలైంది. అంటే రావెల రాజీనామా ఎప్పటి నుండో ఊహిస్తున్నదే. రావెలను రాజీనామా చేయకుండా సీనియర్ నేతలు కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అయితే, చంద్రబాబునాయుడుతో సఖ్యత చెడిన కారణంగా తాను పార్టీలో ఉండలేనని రావెల స్పష్టం చేయటంతో పాటు రాజీనామా చేసేశారు.

 

వచ్చే ఎన్నికల్లో తనకు ప్రత్తిపాడులో టిక్కెట్టు కూడా దక్కదన్నది రావెలకు అర్ధమైపోయింది. దాంతో రావెల వైసిపి వైపు చూశారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ప్రత్తిపాడులో టిక్కెట్టు విషయంలో జగన్ హామీ ఇవ్వలేదట. ముందు పార్టీలో చేరితే సముచిత స్ధానం కల్పిస్తానని మాత్రమే హామీ లభించిందట. దాంతో రావెలకు ఏమి చేయాలో అర్ధం కాలేదు. అందుకనే జనసేన వైపు చూశారు. జనసేనకు ఎటూ నేతలు లేరు. పార్టీకి కూడా రావెల లాంటి దూకుడు స్వభావం ఉన్న నేతల అవసరం చాలా వుంది. కాబట్టి ప్రత్తిపాడులో టిక్కెట్టు హమీ లభించిందట పవన్ నుండి. అందుకనే జనసేనలో చేరాలని డిసైడ్ అయ్యారు.

 

ఇక్కడ విషయం ఏమిటంటే, రావెల లాగే టిడిపికి రాజీనామాలు చేయటానికి మరి కొందరు నేతలు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఎంఎల్ఏ మోదుగుల వేణుగోపాలరెడ్డి కూడా త్వరలో టిడిపికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈ విషయం ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది. అయితే, ఎప్పుడన్నదే తేలలేదు. ఇఫుడు రావెల రాజీనామా చేశారు కాబట్టి త్వరలోనే మోదుగుల రాజీనామా కూడా ఉంటుందని టిడిపిలోనే చర్చ జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: