పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రకటనలు కొన్ని సందర్భాలలో చిత్రంగా ఉంటాయి. ఆయన ఎపుడు ఎందుకు ఎవరిని విమర్శిస్తారో మరెందుకు కీర్తిస్తారో కూడా అర్ధం కాదు. అయితే ఓ విషయాన్ని మాత్రం అంగీకరించాలి. ప్రతీ రోజూ ఏదో విధంగా మీడియాలో  ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఉనికిని తెలియచేయడంలో ఆయన బాగానే సక్సెస్ అవుతున్నారు.


జగన్ మద్దతుట:


రఘువీరారెడ్డి అనంతపురం  టూర్లో  మాట్లాడుతూ ప్రత్యేక హోదాపైనే ఎన్నికలు రేపటి రోజున ఏపీలో జరుగుతాయని చెప్పుకొచ్చారు. అంతకు మించిన అజెండా కూడా లేదని తేల్చేశారు. ఏపీ జనం హోదా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఆ హోదాను ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీయేనని రఘువీరా క్లారిటీగా చెబుతున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ హోదా విషయంలో వైసీపీ అధినేత జగన్ కూడా కాంగ్రెస్ కే మద్దతు ఇస్తారని ఆయన చెప్పడమే సెన్సేషన్ న్యూస్ అవుతోంది.


అందుకే అలాట :


జగన్ ప్రతీ సభలోనూ ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మా పార్టీ మద్దతు ఇస్తుందని చెబుతున్నారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న రఘువీరా కేంద్రంలో రెండే జాతీయ పార్టీలు ఉన్నాయాని, అందులో ఒక పార్టీ బీజేపీ ఇప్పటికే హోదాపై చేతులెత్తేసిందని వివరించారు. అందువల్ల రెండవ పార్టీగా కాంగ్రెస్ హోదా ఇవ్వడానికి ముందుకు వచ్చిందని, ఈ టైంలో హోదా ఇచ్చే పార్టీ కాంగ్రెస్ కాబట్టి జగన్ మద్దతు కూడా కాంగ్రెస్ కే ఉంటుందని తనదైన శైలిలో విశ్లేషించారు.



ఇక తెలుగుదేశం మద్దతు ఎటూ కాంగ్రెస్ కేనని చెప్పినందువల్ల ఏపీలోని రెండు ప్రాంతీయ పార్టీల మద్దతు కాంగ్రెస్ ఖాతాలోకే వస్తాయని రఘువీరా డిక్లేర్ చేసేసారు. అయితే ఇక్కడ  జగన్ కాంగ్రెస్ ని మద్దతు ఇస్తానని ఎక్కడా చెప్పలేదు, పైగా అయన కాంగ్రెస్ హోదా పేరు చెప్పి వంచించిందని కూడా ఘాటు  విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలపై  చట్టం చేసే పార్టీకే మద్దతు అని  కూడా జగన్ పక్కా క్లారిటీతో చెప్పారు. బహుషా జగన్ ద్రుష్టిలో అది మూడవ కూటమి అయినా కావచ్చును కూడా. మరి రఘువీరాకి ఇందులో అలా అర్ధమైందా అని వైసీపీ నెతలు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: