తెలంగాణాలో టీయారెస్ పొత్తులు పెట్టుకోవడం లేదు. ఒంటరిగానే పోటీకి దిగుతోంది. ఇక అక్కడ కాంగ్రెస్, టీడీపీ ఇతర పార్టీలు కూడా పొత్తులు కట్టాయి. ఏపీ విషయానికి వస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్ టీడీపీ పొత్తులు కట్టబోతున్నాయి. వైసీపీ ఒంటరిగా పోటీ చెస్తామని చెబుతోంది. మరో వైపు జనసేన వామపక్ష పార్టీలతో కలిసే అవకాశం ఉంది. మరి ఏపీ ముఖ చిత్రం ఇలా ఉంటే పొత్తులు లేకపఒతే పవర్లోకి రాలేమని ఓ సీనియర్ రాజకీయ నాయకుడు హాట్ కామెంట్స్ చేశారు. అది నిజమవుతుందా


నలబై సీట్లేనట:


ఏపీలో పొత్తులు ఉండాల్సిందేనని పీసీసీ చీఫ్ రఘువీరా స్పష్టం చేస్తున్నారు. ఏపీలో ఇపుడున్న రాజకీయ వాతారవరణంలో ఏ పార్టీకి కూడా సొంతంగా పట్టం కట్టే పరిస్థితి కనిపించడంలేదని ఆయన సూత్రీకరించారు. ఇటువంటి నేపధ్యంలో ఒంటరిగా ఏ పెద్ద పార్టీ పోటీ చేసినా  నలభైకి మించి సీట్లు రావని రఘువీరా చెబుతున్నారు. మరి ఆ కామెంట్స్  జగన్ పార్టీని ఉద్దేశించి  అంటునట్లే భావించాలి. అంటే సింగిల్ గా వెళ్తే రేపటి రోజున వైసీపీ పవర్లోకి రాదని ముందే రఘువీరా వారు జోస్యం చెబుతున్నారన్నమాట.


టీడీపీ రూట్ రైట్ :


అందుకే పరిస్థితిని గమనించి టీడీపీ కాంగ్రెస్ తో పొత్తులు పెట్టులకు సుముఖంగా ఉందని అంటున్నారు. అయితే తాము పొత్తుల విషయం అధినాయకత్వానికి వదిలేశామని, ఎలా చేయమన్నా చేస్తామని చెప్పుకొచ్చారు. మొత్తానికి రఘువీరా బాణాలు మాత్రం వైసీపీ మీదనే వేశారు. 


అలా జరుగుతుందా :


ఏపీలో ఇపుడు అధికారంలో టీడీపీ ఉంది. ప్రధాన ప్రతిపక్షంలో  వైసీపీ ఉంది. మూడవ పార్టీగా జనసేన రంగంలో ఉంది. ఇక బీజేపీ, ఇతర పార్టీలు కూడా పోటీ చేస్తాయి. ఈ బహుముఖీయమైన పోటీలో విజేత కావాలంటే 88 సీట్లు తెచ్చుకోవాలి. మరి ఎక్కడికకక్కడ పార్టీలు, నాయకులు ఓట్లు చీలిస్తే ఏ పార్టీకి మెజారిటీ రాదన్న భావన ఉంది. విశ్లేషకుకు కూడా అలాగే అంచనాలు వేస్తున్నారు. 


కానీ  ఉమ్మడి  ఏపీ నుంచి  చూసుకుంటే హంగ్ అన్న మాట ఎక్కడా వినిపించలేదు. ప్రజలు  తమను నచ్చిన పార్టీకి ఏకమొత్తంగా ఓట్లేసి గెలిపించారు. మరి ఈసారి విభజన ఏపీలో అలాంటి స్థితి  వస్తుందా అన్నది చూడాలి. రఘువీరా చెప్పినది కొట్టిపారేయాడనికీ లేదు. అలాగని నిజమవుతుందని చెప్పడానికీ లేదని అంటున్నారు. మరి సింగిల్ గా వస్తున్న పార్టీ వైసీపీ కి ఈ విషయంలో ఉన్న అంచనాలు ఏంటో కూడా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: